Chandrababu: బాబు చేస్తానన్న అభివృద్ధి కోసం జనం వెయిటింగ్‌!

2024 ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఓటు వేస్తే ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం అయ్యాక ఆ మాట ఎత్తడం లేదేమని జనం ప్రశ్నిస్తున్నారు. తన అనుభవాన్ని ఉపయోగించి అసలు అప్పులు చేయకుండా, కొత్తగా పన్నులు విధించకుండా, సంపదను సృష్టించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తానని చంద్రబాబు ఎన్నికల వేళ హామీ ఇచ్చారు. మరి ఆ మంచి రోజులు ఎప్పుడు వస్తాయా చూద్దామని జనం వేయి కళ్లతో వెయిట్‌ చేస్తున్నారు. ఈ నెల కాకపోతే వచ్చేనెల లేదంటే ఆపై నెల బాబు ఎన్నికల హామీలు అమలు చేస్తారని జనం ఎదురుచూస్తూనే ఉన్నారు. చంద్రబాబు సీఎంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడిచిపోయాయి. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న 143 హామీలను ఆయన అమలు చేయలేదు. ముఖ్యంగా సూపర్ సిక్స్ అంటూ విస్తృతంగా ప్రచారం చేసిన ముఖ్యమైన ఆరు హామీలను అమలు చేయలేదు.

ఏదీ సూపర్‌ సిక్స్‌?
రైతులకు ఏటా రూ.20 వేలు సాగుకు పెట్టుబడి సాయం, మహిళలకు ఉచిత బస్‌ ప్రయాణం, తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి ఏటా రూ.15 వేలు, 20 లక్షల మందికి ఉద్యోగాలు లేదంటే నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, ఏటా మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, ప్రతి మహిళకు నెలకు రూ.15 వేలు జమ చేస్తానని చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ పేరిట హామీ ఇచ్చారు. ఇవన్నీ ఒకసారి కాకపోయినా దశల వారీగా అయినా అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయడం లేదేమని జనం ప్రశ్నిస్తున్నారు.

 బాబు స్టేట్‌మెంట్‌పై జనం షాక్‌ తాను ఈ హామీలను ఏమాత్రం అమలు చేయలేనని ఆయన ఇటీవల ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్పడంతో జనం షాక్‌ తిన్నారు. వైఎస్సార్‌ సీపీ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని, అందుకే తన హామీలను అమలు చేయలేకపోతున్నానని చెప్పడాన్ని ఓటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన అనంతరం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అన్నింటిని అమలు చేస్తానని చెప్పడాన్ని తప్పు పడుతున్నారు. చంద్రబాబు సామర్థ్యంపై ఎంతో నమ్మకంతో ఆయన ఇచ్చిన హామీలను నమ్మి తాము ఓటు వేశామని ఇప్పుడు బాబు ఇలా చెప్పడం న్యాయమేనా అని ప్రశ్నిస్తున్నారు.

బాబు ఇచ్చిన హామీల అమలు సాధ్యం కాదని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ముందే చెప్పారు. చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ సరిపోదని మరిన్ని అప్పులు చేయాల్సి ఉంటుందని కూడా జగన్ చెప్పారు. కానీ చంద్రబాబు తన అనుభవంతో సంపద సృష్టించి హామీలు అమలు చేస్తారని తాము నమ్మామని, ఇప్పుడేమో ఆయన తన వల్ల కాదని చెప్పడం జనం మోసగించడమే కదా! అని ప్రశ్నిస్తున్నారు.

వస్తున్న ఆదాయం ఏమైపోతోంది?
సుమారు 2.70 లక్షల కోట్ల బడ్జెట్‌ ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు వివిధ శాఖల ద్వారా వచ్చే ఆదాయం, కూటమి ప్రభుత్వం ఈ 8 నెలల్లో చేసిన సుమారు 1.05 లక్షల కోట్ల అప్పుల సొమ్ము, కేంద్రం ఇస్తున్న గ్రాంట్ల డబ్బు ఏమైపోయింది అన్న ప్రశ్నను ఓటర్లు సంధిస్తున్నారు. అటు అభివృద్ధి కనిపించకుండా, ఇటు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయకుండా ఈ వచ్చిన సొమ్మంతా ఎక్కడికి పోతోంది? ధరలు పెంచబోనని చెప్పిన ఆయన విద్యుత్ చార్జీలను 3 సార్లు పెంచారు. భూమి రిజిస్ట్రేషన్ విలువను 20 నుంచి 35 శాతం వరకు ఏరియాలను బట్టి పెంచుకుంటూ పోయారు. నిత్యవసర సరుకులు ధరలు విపరీతంగా పెరిగాయి.

పదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసి, నాలుగోసారి ముఖ్యమంత్రి పాలిస్తూ రాజకీయాల్లో 47 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు తెచ్చిన అప్పులతో ఎన్నికల హామీలను నెరవేర్చలేదు. సంపదనూ సృష్టించలేదు. రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ ఆర్థిక విధ్వంసం సృష్టిస్తోంది అంటూ ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లూ చేసిన విమర్శలను సీఎంగా ఇప్పుడు కూడా చేయడం సమంజనమేనా? అని జనం ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్‌ సీపీకి కన్నా మెరుగైన పాలన అందిస్తారన్న ఆశతోనే బంపర్‌ మెజార్టీలో కూటమి పార్టీలకు అధికారం కట్టబెట్టామని, ఇప్పటికైనా విమర్శలు కట్టిపెట్టి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఓటర్లు ముక్తకంఠంతో కోరుతున్నారు.

మేడ్చల్ లో దారుణం.. పట్టపగలే దారుణంగా | Medchal incident | Telugu Rajyam