ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం మరో కీలక ప్రకటన చేసింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 10వ తేదీ నుంచి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. గతంలో నిలిచిన ఎన్నికల ప్రక్రియను అక్కడి నుంచే కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేసింది.
మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు విధించింది. అలాగే మార్చి 13న రీపోలింగ్ ఉంటుందని ఎస్‌ఈసీ పేర్కొంది. అలాగే మార్చి 14 ఓట్ల లెక్కింపు జరుగనుంది.
ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు విడతలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇప్పుడు.. మూడో విడత పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇవాళ్టితో మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఫిబ్రవరి 17న 13 జిల్లాల్లోని 19 రెవెన్యూ డివిజన్లలో 3 వేల 249 పంచాయతీలు, 32 వేల 502 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక.. అదేరోజు సాయంత్రం ఫలితాలు వెలువడనున్నాయి.