ఏపీ మద్యం అంత ప్రమాదకరమా.. ఆ కారణం వల్లే ప్రాణాలు పోతున్నాయా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మద్యం షాపులలో విచిత్రమైన పేర్లతో మద్యం బాటిళ్లను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఏపీలో మద్యం రేట్లు ఎక్కువగా ఉండటంతో పాటు క్వాలిటీ మద్యం లభించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఏపీ సర్కార్ కు ఎక్కువ మొత్తంలో మద్యం వల్ల ఆదాయం లభిస్తుండగా మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చిన జగన్ సర్కార్ ఆ దిశగా అడుగులు వేయకపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా అమ్ముతున్న మద్యంలో విషపూరిత, హానికరమైన కెమికల్స్ ఉన్నాయని ప్రైవేట్ ల్యాబ్ నివేదికల ద్వారా వెల్లడవుతోంది. డై ఇథైల్ థాలేట్, ఐసోపులెరిక్ యాసిడ్, ఫైరోగలాల్, ఇతర ప్రమాదకర కెమికల్స్ 3 రకాల మద్యం బ్రాండ్లలో ఉన్నాయని నివేదికల ద్వారా వెల్లడైంది. ఎవరైతే ఈ మద్యం తాగుతారో వాళ్లను ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంది.

కెమికల్స్ తో ఉన్న మద్యం బ్రాండ్లు నాడీవ్యవస్థ పనితీరుపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ మద్యం తాగేవాళ్లకు భవిష్యత్తులో జన్యు సంబంధిత సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రజల ప్రాణాలతో ఏపీ ప్రభుత్వం చెలగాటమాడుతోందని పలువురు టీడీపీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇతర రాష్ట్రాల్లో ఉన్న రెగ్యులర్ బ్రాండ్లు ఏపీలో మాత్రం అమ్మకపోవడం గమనార్హం. ప్రభుత్వ మద్యం దుకాణాలలో డిజిటల్ చెల్లింపులకు అనుమతులు ఇవ్వకపోవడంపై కూడా నెగిటివ్ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రా గోల్డ్ విస్కీ, 9 సీహార్స్ విస్కీ, సిల్వర్ స్ట్రైప్స్ విస్కీలలో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయని నివేదికలలో వెల్లడైంది. ఏపీ ప్రభుత్వం మద్యం విషయంలో టీడీపీ, జనసేన నేతలు చేస్తున్న ఆరోపణల గురించి ధీటుగా స్పందించడంలో ఫెయిలవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.