ఏపీకి ‘స్పెషల్ స్టేటస్’ వచ్చేసింది…అసలు విషయం ఏమిటంటే?

ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ కావాలంటూ అనేక రకాలుగా కేంద్రం పై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు చేసినా కూడా ఏపీకి స్పెషల్ స్టేటస్ మాత్రం కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా లేనట్లే కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ..తాజాగా ఆంధ్రప్రదేశ్‌ కి స్పెషల్ స్టేటస్ వచ్చింది. అదేంటి ఎక్కడా మేము వినలేదు కదా అని అనుకుంటే ..ఇక్కడ ఓ చిన్న కరెక్షన్ ఉంది. ఏపీకి స్పెషల్ స్టేటస్ వచ్చింది నిజమే కానీ ..నిజమైన స్పెషల్ స్టేటస్ కాదు , ఏపీ లో స్పెషల్ స్టేటస్ అనే పేరుతో లిక్కర్ బాటిల్ విక్రయాలు జరుపుతున్నట్టు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Special Status పేరు ఉన్న క్వార్టర్ బాటిల్‌ ప్రస్తుతం అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్‌గా మారింది. ఇది ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం బ్రాండ్ అని.. జగన్ మోహన్ రెడ్డిపై సెటైర్లు వేస్తున్నారు. గన్ మోహన్ రెడ్డి ఏపీకి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానంటే ఏంటో అనుకున్నాం కానీ, ఇలా తీసుకొస్తారని అనుకోలేదంటూ కొందరు టీడీపీ అనుకూల నెటిజన్లు, సోషల్ మీడియా జనం ట్రోల్ చేస్తున్నారు. ఈ ఫొటోను వాడుకుని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్, మీమ్స్ చేస్తున్నారు. ఈ క్వార్టర్ బాటిల్ విస్కీ ధర రూ.180 అని ఉంది. దానిపై తెలుగులో ‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం. మద్యం సేవించి వాహనం నడపరాదు.’ అని రాసి ఉంది

లిక్కర్ బ్రాండ్లపై సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడం కొత్తేమి కాదు. గతంలో కూడా కొన్ని లిక్కర్ బాటిల్స్‌పై ట్రోలింగ్స్ నడిచాయి. కాకపోతే ఇప్పుడు స్పెషల్ స్టేటస్ పేరుతో లిక్కర్ రావడం వైరల్ అవుతోంది. మొత్తానికి ఈ స్పెషల్ స్టేటస్ లిక్కర్ బాటిల్ చర్చనీయాంశంగా మారింది.