AP: ఆంధ్రప్రదేశ్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు. ఇలా ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను ఏర్పాటు చేసి ప్రభుత్వం నుంచి అందే పథకాలు నేరుగా ప్రజల ముంగిటకు వెళ్లే విధంగా ఈ వాలంటీర్ వ్యవస్థను ఎంతో విజయవంతం చేశారు అయితే వీరి సేవలకు గాను ప్రభుత్వం వీరికి 5000 రూపాయల గౌరవ వేతనం ఇచ్చేవారు.
ఇలా వాలంటీర్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం మొదట్లో పూర్తిస్థాయిలో విమర్శించింది. అయితే జగన్ పాలనలో వాలంటీర్ల ప్రాధాన్యత గుర్తించిన కూటమి నేతలు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లకు పదివేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇలా పదివేల రూపాయల వేతనం అనేసరికి వాలంటీర్లు కూడా కూటమి ప్రభుత్వం వైపే మొగ్గు చూపారు.
ఈ తరుణంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ గురించి ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు వాలంటీర్లు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ధర్నాలు చేస్తున్నప్పటికీ గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను రెన్యువల్ చేయలేదని అందుకే తమ ఇప్పుడేం చేయలేము అంటూ ఇచ్చిన మాటను కూటమి నేతలు తప్పారు. దీంతో వాలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు.
తమ సమస్యలను పరిష్కరించాలంటూ గాంధీనగర్ ధర్నా చౌక్‌లో ధర్నాకు దిగారు.2.60 లక్షల మంది వాలంటీర్లుగా పని చేస్తున్నామని.. ఆరు నెలలుగా పోరాటాలు చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. ఎన్నికల ముందు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారని గుర్తు చేశారు ఇటీవల విజయవాడ వరదలు రాగా వాలంటీ సేవలను ఎలా ఉపయోగించుకున్నారు అంటూ ప్రశ్నించారు.
ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుందని చెప్పిన నేతలే ఇప్పుడు ఆడబిడ్డలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన మాట ప్రకారం వాలంటీర్లను తిరిగి విధులలోకి తీసుకొని తమకు ఉద్యోగ భద్రత కల్పించాలి అంటూ ఈ సందర్భంగా వాలంటీర్స్ డిమాండ్ చేస్తున్నారు.
