AP: మా హయాంలో వచ్చినవేనని… మంత్రి లోకేష్ తీరుపై మాజీ మంత్రి అమర్నాథ్ ఫైర్?

AP: ఏపీలో రాజకీయాలు ఎప్పుడు కూడా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూనే ముందుకు కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే మంత్రి లోకేష్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వారికి జగన్ పూర్తిస్థాయిలో ద్రోహం చేశారు అంటూ మండిపడ్డారు.

ఈ విధంగా లోకేష్ జగన్మోహన్ రెడ్డి తీరును ప్రశ్నిస్తూ చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఇక త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటనకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా నరేంద్ర మోడీ కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఇక మోడీ విశాఖపట్నం పర్యటనలో పాల్గొనబోతున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్నింటిని కూడా మంత్రి నారా లోకేష్ చూసుకుంటున్నారు.

ఇలా మోడీ పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి
గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ మంత్రి లోకేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.. నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటనలో భాగంగా శంకుస్థాపన చేసే ప్రాజెక్టులన్ని కూడా మా హయామంలో వచ్చినవేనని ఈయన తెలిపారు.జగన్ పాలనలో వచ్చిన ప్రాజెక్టులు తమ పాలనలో వచ్చినట్లు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో జగన్ మీద మాట్లాడి మంత్రి లోకేష్ అభాసు పాలయ్యారని తెలిపారు. ఐటి మంత్రిగా విద్యాశాఖ మంత్రిగా లోకేష్ కు తన శాఖలపై ఏమాత్రం అవగాహన లేదని ఫైర్ అయ్యారు.

లోకేష్ కు ఏ శాఖ పై అవగాహన లేకుండా చివరికి సకల శాఖ మంత్రిగా మారిపోయారు అంటూ అమర్నాథ్ కామెంట్లు చేశారు. అయితే ఈ కామెంట్లపై కూటమి కార్యకర్తలు నేతలు సైతం విమర్శలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మంచి అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో చూసి ఓర్వలేనటువంటి వైకాపా ఈ అభివృద్ధిని కూడా తమ ఖాతాలో వేసుకోవడం కోసమే పాట్లు పడుతున్నారు అంటూ అమర్నాథ్ వ్యాఖ్యలపై విమర్శలు కురిపిస్తున్నారు.