AP: ఏపీలోని కూటమి పార్టీలో విభేదాలు చోటు చేసుకుంటున్నాయా అంటే అవుననే చెప్పాలి ఇటీవల తాడిపత్రి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తన బస్సులు కాలిపోవడంతో ఈయన ఆ ఘటనపై స్పందిస్తూ సంచలన వీడియోని విడుదల చేశారు. ఇందులో జగన్మోహన్ రెడ్డిని ప్రశంసిస్తూ బిజెపిని విమర్శలు చేశారు. జగన్ రెడ్డి చాలా మంచోడు రా మీ కంటే కూడా నా బస్సులను మాత్రమే నిలిపినాడు కానీ ఇలా మీలాగా నా బస్సులను కాల్చేయలేదు అంటూ జగన్మోహన్ రెడ్డి గురించి గొప్పగా చెబుతూ తన బస్సు కాలిపోవడం వెనుక బిజెపి ప్రమేయం ఉందని చెప్పకనే చెప్పేశారు..
అదేవిధంగా బిజెపి మహిళ నేత అయినటువంటి మాధవి లత గురించి ఈయన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇలా బిజెపి నాయకుల గురించి జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే మంత్రి సత్య కుమార్ స్పందిస్తూ జేసీ వ్యాఖ్యలను ఖండించడమే కాకుండా ఆయనకు తనదైన శైలిలోనే వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ధర్మవరం ఎమ్మెల్యే వైద్యశాఖ మంత్రి సత్య కుమార్ మాట్లాడుతూ…
జేసీ ప్రభాకర్ రెడ్డి మీరు మాట్లాడేటప్పుడు చాలా కంట్రోల్ లో ఉండి మాట్లాడండి మీడియా అటెన్షన్ కోసం ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదు.బీజేపీ ప్రభుత్వం తమ బస్సులు కాల్చిందని చెబుతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి స్పోక్స్ పర్సనా? జేసీ ప్రభాకర్ రెడ్డికి జగన్ పై అంత ప్రేమ ఉంటే వెళ్లి జగన్ పంచన చేరమనండి? ఎప్పుడూ కాంట్రవర్సీ.. జేసీ ప్రభాకర్ రెడ్డికి బాగా అలవాటుగా మారిపోయింది.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన బస్సులన్నీ దొంగవని కేసులు పెట్టింది అయితే ఆ కేసులకు బీజేపీకి సంబంధం ఏంటని ఈయన ప్రశ్నించారు. ఇక నటీ మాధవీ లత డిసెంబర్ 31వ తేదీ మహిళలు జాగ్రత్తగా ఉండాలని మాత్రమే చెప్పారు. అయితే ఆమె ఎలాంటి బట్టలు వేసుకోవాలి వేసుకోకూడదు అనే విషయం కూడా ప్రభాకర్ రెడ్డి చెప్పాలా అంటూ ఈయన ఘాటుగా స్పందించారు. నరేంద్ర మోడీ సహకారంతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ న్యాయకత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంది ఇలాంటి సమయంలో మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అంటూ సత్య కుమార్ తనదైన శైలిలోనే వార్నింగ్ ఇచ్చారు.