కోర్ట్ షాక్ :‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్ ఆంధ్రాలో లేదు

రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్ కాకుండానే సంచలనాలకు కేంద్ర బిందువైంది. రేపు శుక్రవారం రిలీజ్ డేట్ ఇచ్చారు. ఈ నేపేధ్యంలో సినిమా ఎలా వుంటుందో అన్న విషయం హాట్ టాపిక్ గా మారితే.., అసలు ఈ సినిమా విడుదల అంవుతుందా లేదా ? అయితే థియేటర్లు ఇస్తారా? ఇవ్వరా? అన్న విషయం మీద మీడియాలో ఓ రేంజిలో చర్చ జరుగుతోంది. అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం ఎట్టి పరిస్దితుల్లోనూ ఈ సినిమా రిలీజ్ చెయ్యాల్సిందే అన్నట్లుగా రాత్రింబవళ్లూ తన టీమ్ తో పని చేస్తున్నారు… చేయిస్తున్నారు.

రాష్ట్రంలో ఏప్రిల్ 11న శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సినిమా విడుదలను ఆపివేయాలని మంగళగిరి సీనియర్ సివిల్ జడ్జ్ కమ్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్ ఆదేశాలు జారీ చేశారు. 

ఏప్రిల్ 15 వరకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను థియేటర్లలో.. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ప్రదర్శించకూడదని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఇంజక్షన్ ఆర్డర్‌ను జారీ చేసింది.

ఈ ఇంజక్షన్ ఆర్డర్‌ను దర్శకులు రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు‌తో పాటు నిర్మాత రాకేశ్ రెడ్డికి పంపింది. దీంతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు ఆంధ్రప్రదేశ్‌లో రిలీజ్ లేనట్లే అని తేలింది.

అలాగే సినిమా ప్రెస్ షోను కూడా క్యాన్సిల్ చేశారు. ఈ నేపధ్యంలో రేపు సినిమా రిలీజ్ అవటం కష్టమే అంటున్నారు.

అంతేకాదు యూ ట్యూబ్ – ఫెస్ బుక్ – ట్విట్టర్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలలో కూడా సినిమాకు సంబందించిన ఎలాంటి ప్రస్తావన ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.రామ్ గోపాల్ వర్మ అగస్త్య మంజులకు నిర్మాత రాకేష్ రెడ్డి లకు నోటీసులు కూడా పంపినట్లు తెలుస్తోంది.