అందుకే 1 వ తేదీన జీతాలు చెల్లించలేదు

అందుకే 1 వ తేదీన జీతాలు చెల్లించలేదు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా మొదటి వారంలో జీతాలు ఇస్తారు . అయితే ఆగష్టు 1వ తేదీ సాయంత్రానికి ఉద్యోగుల ఖాతాల్లో కి జీతం డబ్బు రాలేదు . దీంతో ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, అందుకే జీతాలు ఇవ్వలేదనే ప్రచారం జోరందుకుంది . ఉద్యోగుల్లో కూడా ఇదే భావన వచ్చింది . సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అయిపొయింది . వెంటనే ప్రభుత్వంమేలుకుంది . ఈ విషయలో ఆర్ధిక శాఖ వివరణ ఇచ్చింది . సాంకేతిక కారణాల వల్లనే తాము జీతాలు ఇవ్వలేకపోయామని అధికారులు చెప్పారు .

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని ,అందుకే ఈ నెల జీతాలు ఇవ్వలేకపోయింది అందరు భావించారు . కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తే తప్ప ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి జీతాలు ఇచ్చే ఆర్ధిక స్తోమతు లేదనే ప్రచారం జరిగింది . అయితే అలాంటి స్థితి ఏమీ లేదని జులై 31 తేదీ కల్లా జీతాల ఫైలు ఆర్ బీ ఐ కి పంపించడం జరిగిందని , 1 వ తేదీ న అందరికీ పెన్షన్లు చెల్లించడం జరిగిందని , జీతాలను మాత్రం 2వ తేదీన వారి ఖాతాల్లో జమ చెయ్యడం జరిగింది ఆర్ధిక శాఖ వివరణ ఇచ్చింది .