ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. భారీ వేతనంతో 423 ప్రభుత్వ ఉద్యోగాలు!

Job-Vacancy

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. మిషన్‌ వాత్సల్య స్కీమ్ అమలు దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. 13 జిల్లాల పరిధిలో 423 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఈ సంస్థ సిద్ధమైంది. బాలలకు సంబంధించిన ఏజెన్సీలు, కమిటీలు, బోర్డులలో ఈ ఉద్యోగాల భర్తీ జరగనుందని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలనుఈ వేర్వేరు విధానాలలో భర్తీ చేస్తున్నారు.

 

ఈ ఉద్యోగ ఖాళీలలో 97 ఉద్యోగ ఖాళీలను అవుట్ సోర్సింగ్ విధానంగా భర్తీ చేయనుండగా 15 పోస్టులను తాత్కాలిక విధానంలో భర్తీ చేయనున్నారు. మిగతా ఉద్యోగ ఖాళీలను మాత్రం కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనాథ బాలల కొరకు ఈ స్కీమ్ అమలవుతుండటం గమనార్హం. ఈ స్కీమ్ ద్వారా 18 ఏళ్ల లోపు అనాథలకు నెలకు 4,000 రూపాయలు ఆర్థిక సహాయం అందుతుంది.

 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ స్కీమ్ ను అమలు చేస్తున్నాయి. ఈ స్కీమ్ కోసం కేంద్రం 60 శాతం ఖర్చు చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం ఖర్చు చేయనుంది. త్వరలో 423 ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

 

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీ రేంజ్ లోనే వేతనం లభిస్తుందని సమాచారం అందుతోంది. ఏపీ ప్రభుత్వం గత నాలుగేళ్లలో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ చేయగా రాబోయే రోజుల్లో కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్ కలగనుంది.