నిమ్మగడ్డ కీలక నిర్ణయం.. ఏపీ ఎన్నికల సంఘం జేడీ పై వేటు

ap cec nimmagadda speaks on ap panchayat elections

ఏపీ ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్‌పై ఎస్ఈసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. జీవీ సాయి ప్రసాద్ 30 రోజుల పాటు సెలవులపై వెళ్లి.. ఇతర ఉద్యోగులను సైతం సెలవుపై వెళ్లేలా ప్రభావితం చేశారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి. క్రమశిక్షణారాహిత్యంగా ఎన్నికల కమిషన్ పరిగణించి, ప్రస్తుత ఎన్నికలకు విఘాతం కలిగించేలా చర్యలున్నాయని ఎస్ఈసీ తెలిపింది.

ap cec nimmagadda speaks on ap panchayat elections
 

జీవీ సాయిప్రసాద్‌ను ‌విధుల నుంచి తొలగించింది, ప్రభుత్వ సర్వీసుల్లో ప్రత్యేక్షంగా గానీ, పరోక్షంగా గానీ విధులు నిర్వహించడానికి వీలులేదని చెప్పింది. ఆర్టికల్ ‌243 రెడ్‌విత్‌, ఆర్టికల్‌ 324 ప్రకారం విధుల నుంచి సాయిప్రసాద్‌ని తొలగిస్తున్నట్లు ఎస్‌ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.

నాలుగు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం షెడ్యూల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 9 వరకు ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలోని సీనియర్‌ ఉద్యోగులు ఎవరూ సెలవులు తీసుకోవద్దని.. అందరూ అందుబాటులో ఉండాలని ఎస్‌ఈసీ సూచించింది. కానీ సాయి ప్రసాద్ మాత్రం భిన్నంగా 30 రోజుల సెలవుపై వెళ్లడమే కాకుండా ఇతర ఉద్యోగులను ప్రభావితం చేశారని.. దీన్ని క్రమశిక్షణారాహిత్యంగా పరిగణించి వేటు వేశారు.