చంద్రబాబు లేఖలలో అన్నీ అవాస్తవాలు, ఆయనది అంతా రాజకీయమే:ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్

dgp gowtham sawang

ఆంధ్రప్రదేశ్ :రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అమలు కావడం లేదని శాంతి భద్రతలు అదుపులో లేవని రాష్ట్రంలో జరుగుతున్న పలు ఘటనలపై పోలీసులు నిర్భయంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు మాజీ సీఎం ప్రతిపక్ష నేత చంద్రబాబు పలు మార్లు లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు రాసిన లేఖలపై ఏపి డీజీపీ గౌతమ్ సవాంగ్ మరోసారి స్పందించారు. చంద్రబాబు అవాస్తవాలతో లేఖలు రాస్తున్నారని…ఆ లేఖలలో ప్రస్తావించిన విషయాలపై విచారణ జరిపితే ఆరోపణలు అవాస్తవాలను తేలుతోందని సవాంగ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రాజకీయ అజెండాతో లేఖలు రాస్తున్నారని ఏపీలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని చెప్పారు.

dgp gowtham sawang
dgp gowtham sawang

పొలిటికల్ ఎజెండాతో పోలీసులను వివాదంలోకి చంద్రబాబు తెస్తున్నారని సవాంగ్ అన్నారు. హిందూ దేవాలయాలపై దాడుల పేరుతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకున్నామన్నారు. ఫిర్యాదుదారుడు పోలీస్ స్టేషన్ కు నేరుగా రాకుండా సోషల్ మీడియా వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేసేలా చర్యలను చేపట్టామని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించబోమన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రకాశం జిల్లాలో హోంగార్డ్స్ అభ్యున్నతికి సహకార సంఘాన్ని ప్రారంభించామన్నారు. ప్రకాశం పోలీసులు టెక్నాలజిలో ముందున్నారని మిగిలిన జిల్లా పోలీసులకు ప్రకాశం పోలీసులు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో నూతన సాంకేతిక మార్పులు తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని సైబర్ నేరాలపై పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతోందని అన్నారు.