ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ అమలు చేస్తున్న పథకాల వల్ల పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన ఎంతోమంది ప్రజలు ప్రయోజనాలను పొందారు. అయితే జగన్ ఎంత మంచిగా పాలన సాగించినా కొంతమంది మాత్రం ఆయనపై విమర్శలు చేస్తుండటం గమనార్హం. జగన్ సర్కార్ గురించి నెగిటివ్ ఒపీనియన్ కలిగేలా కొంతమంది వ్యవహరిస్తున్నారు.
సోషల్ మీడియాలో తాజాగా ఒక వీడియో వైరల్ కాగా ఆ వీడియోలో ఏపీ విద్యార్థులు తమకు రోడ్డు కావాలని నిరసన వ్యక్తం చేశారు. నర్సీపట్నంలోని లింగాల గ్రామానికి చెందిన విద్యార్థులు తమ గ్రామానికి రోడ్డు వేయాలని చేతులు జోడించి అడిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోకు సంబంధించి వెబ్ సైట్లలో, టీవీ ఛానెళ్లలో కథనాలు ప్రచారంలోకి రావడం గమనార్హం.
అయితే వైరల్ అయిన వీడియోను కొందరు కావాలని తీశారని క్లారిటీ వచ్చింది. కొందరు పిల్లలను నదిలో ఉంచి కావాలని ఆ వీడియో తీశారని వెల్లడైంది. ఈ విషయం తెలిసి సీఎం జగన్ పై ఇంత పగ ఎందుకో అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడానికి ప్రతిపక్ష నేతలు ఇంతకు తెగించారా అని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
వరాహనదిపై వంతెన బాగానే ఉందని అప్రోచ్ రోడ్డు కోసం మరింత భూమిని సేకరిస్తున్నామని త్వరలో రోడ్డు నిర్మాణం చేపడతామని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం గురించి దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఈ వార్తలు ఆగిపోతాయేమో చూడాలి.