సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి .. మాట ఇస్తే , ఆ మాట కోసం ఎక్కడివరకైనా పోరాడే వ్యక్తిత్వం ఉన్న ప్రజానేత. ఆ గుండె ధైర్యమే నేడు ఆయన్ని ఎంతమంది ప్రజల గుండెల్లో నిలిచేలా చేసింది. సీఎం జగన్ ఓ మాట చెప్పారు అంటే అది నిజం అవ్వాల్సిందే. అది సాధ్యం కాదు అంటే జగన్ నోట ఆ మాట రాదు . ఇక ఏపీలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎన్నో సంక్షేమ పథకాల్ని తీసుకువచ్చిన సీఎం వైఎస్ జగన్ .. తాజాగా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించారు.
2019 ఖరీఫ్ లో పంట నష్టపోయిన 9.48 లక్షల రైతుల ఖాతాల్లో ఈ పథకం ద్వారా రూ.1,252 కోట్లు జమ చేయనున్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, వైఎస్సార్ పంటల బీమా పథకంతో పాలనా పరంగా మరో అడుగు ముందుకేశామని తెలిపారు. గతంలో పంటల బీమా పథకంలో చేరేందుకు రైతులు నిరాకరించేవారని, కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించేలా నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. గతంలో 20 లక్షల మంది రైతులకు మాత్రమే ఇన్సూరెన్స్ పరిధిలో ఉంటే.. ఇప్పుడు 57 లక్షల మంది రైతులు పంటల బీమా పథకంలో నమోదయ్యారని చెప్పారు. కోటి 14 లక్షల ఎకరాలను బీమా పరిధిలోకి తీసుకొచ్చామని.. గ్రామ సచివాలయాలతో ఆర్‌బీకేలను అనుసంధానం చేశామని.. గ్రామంలోని ప్రతి ఎకరా ఈ-క్రాపింగ్‌లో నమోదవుతోందన్నారు.
భూమి సాగు చేస్తూ, ఈ క్రాప్‌లో రైతులు నమోదు చేసుకున్న ప్రతి ఎకరాన్ని పంటల బీమా పరిధిలో చేర్చి, రైతుల తరఫున బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తూ, వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమలు చేస్తోంది. అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయినప్పుడు ఆ వివరాలు అంచనా వేసి, బీమా పరిహారం అందించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.