ఆ టీడీపీ నేతపై దృష్టి పెట్టిన సీఎం జగన్.. మరో ఎమ్మెల్యేకు షాక్ తప్పదా?

YS Jagan

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూల జిల్లాలలో కర్నూలు జిల్లా ఒకటి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉండగా అన్ని నియోజకవర్గాలలో 2019లో వైసీపీ విజయం సాధించింది. అభ్యర్థుల కంటే జగన్ పై ఉన్న నమ్మకం వల్లే ఈ జిల్లాలో ఈ స్థాయి ఫలితాలు వచ్చాయి. అయితే కొన్ని నియోజకవర్గాలలో మాత్రం టీడీపీ వైసీపీకి గట్టి పోటీ ఇచ్చింది. కర్నూలు జిల్లాలో జనసేన పార్టీ మాత్రం పెద్దగా ప్రభావం చూపలేదు.

ఈ జిల్లాలో పవన్ ను అభిమానించే వాళ్లు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నా ఆ అభిమానం సినిమాల వరకే పరిమితం కావడం గమనార్హం. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బనగానపల్లె నియోజకవర్గం నుంచి ప్రస్తుతం కాటసాని రామిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన బీసీ జనార్థన్ రెడ్డి కాటసాని రామిరెడ్డికి గట్టి పోటీ ఇవ్వడంతో ఈ నియోజకవర్గంలో వైసీపీకి మెజారిటీ తగ్గింది.

అయితే బీసీ జనార్థన్ రెడ్డిని వైసీపీలో చేర్చుకోవడానికి జగన్ ఆసక్తి చూపిస్తున్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఆయన పార్టీలో చేరితే మాత్రం వచ్చే ఎన్నికల్లో కాటసాని రామిరెడ్డికి భారీ షాక్ తప్పదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బీసీ జనార్థన్ రెడ్డి వైసీపీలో చేరితే మాత్రం టీడీపీ నష్టపోతుందని చెప్పవచ్చు. ఎన్నికల్లో మెజారిటీ కూడా ప్రస్తుతం కీలకంగా మారింది.

జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం టీడీపీకి షాక్ ఇచ్చే విధంగా ఉండటం గమనార్హం. 2024 ఎన్నికల్లో టీడీపీ ఘోర ఫలితాలు సాధించే దిశగా జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. 2024 ఎన్నికల ఫలితాలు కూడా షాక్ ఇస్తే ఏపీలో టీడీపీ కనుమరుగు అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.