మావోయిస్టుల కాల్పుల్లో మృతి చెందిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం న్యూయార్క్ లో ఉన్న ఆయన ఎన్నారైల సభలో ప్రసంగిస్తూ కిడారి, సివేరి మృతి తనను బాధకు గురి చేసిందన్నారు. మావోయిస్టుల దాడిని తీవ్రంగా ఖండించారు. ఇంకా ఆయన ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే కింద ఉంది చదవండి.
- అరకు సిట్టింగ్ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను నక్సలైట్లు దారుణంగా చంపేశారు.
- మీరంతా ఎలాగైతే ఎంతో ఉత్సాహంగా పార్టీ కార్యక్రమానికి వచ్చారో, వాళ్ళు కూడా అలాగే గ్రామదర్శిని కార్యక్రమం కోసం గ్రామానికి వెళుతున్న సందర్భంలో వారిని కిరాతకంగా, దారుణంగా చంపేయడం జరిగింది. ఇది చాల బాధాకరమైన విషయం.
- చాలా మంచి వ్యక్తులు. గిరిజనులకు యెనలేని సేవలు అందించాలని ప్రజసేవలో ఉన్నప్పుడు చంపేయడం చాలా బాధను కలిగిస్తుంది.
- దీనిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు.
- ఇలాంటివి చేయడం సమాజానికి మంచిది కాదు అని తెలియజేసుకుంటూ ఆ దాడిని, ఎమ్మెల్యేని, మాజీ ఎమ్మెల్యేని చంపడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ, గర్హిస్తూ ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే విధంగా చర్యలు తీసుకుంటాము.
- ఏ ఆశయాల కోసమైతే వారు పని చేసారో ఆ ఆశయాలు నెరవేరే దిశగా కొనసాగిస్తాము.
- ప్రాణం పోయలేని వారికి ప్రాణం హక్కు తీసే లేదు. నిర్మాణమే మన బాధ్యత, విధ్వంసం మన నైజం కాకూడదు అని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు.
- మావోయిస్టులు చేసిన ఈ హత్యలను అందరూ ఖండించాలి అని సూచించారు.
ఈ మేరకు ఆయన ట్విట్టర్లో కూడా ఒక ట్వీట్ పెట్టారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు చంపేశారన్న వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇలాంటి దాడులు మానవత్వానికే మాయని మచ్చ. ప్రజాస్వామ్యవాదులందరు దీనిని తీవ్రంగా ఖండించాలని పోస్టు పెట్టారు.
అరకు ఎమ్మెల్యే కిడారు సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు కాల్చి చంపారన్న వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇలాంటి దాడులు మానవత్వానికే మాయని మచ్చ. ప్రజాస్వామ్య వాదులందరూ ఈ దాడిని ఖండించాలి.
— N Chandrababu Naidu (@ncbn) September 23, 2018