అమరావతినే రాజధానిగా ఉంచి అలా చేయొచ్చుగా జగన్.. నష్టం ఏంటంటూ?

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడి ఉంది. టీడీపీ మాత్రం అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలని భావిస్తోంది. ఈ రెండు పార్టీల వైఖరి వల్ల ఏపీ ప్రజలు నష్టపోతున్నారు. అయితే రాజకీయ విశ్లేషకులు, మేధావులు జగన్ ఒక పని చేస్తే ఎవరికీ ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు. వాస్తవానికి హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయడానికి కేంద్రం నుంచి కూడా మద్దతు ఉంది.

అమరావతి నుంచి జగన్ పాలన సాగించి అదే సమయంలో కర్నూలు, వైజాగ్ లలో మరింత అభివృద్ధి జరిగే దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 2024 ఎన్నికల సమయానికే విశాఖ, కర్నూలు జిల్లాలను ఊహించని స్థాయిలో అభివృద్ధి చేస్తే జగన్ పై అక్కడి ప్రజల హృదయాల్లో మంచి అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. న్యాయపరంగా కూడా జగన్ కు ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ అయితే ఉండదు.

అభివృద్ధి వికేంద్రీకరణకు వ్యతిరేకమని ఏ రాజకీయ పార్టీలు చెప్పలేవు. అమరావతి నుంచి పాలన సాగించినంత మాత్రాన వైసీపీకి ఎలాంటి నష్టం కలగదు. రాజధాని విషయంలో కాలయాపన చేయడానికి బదులుగా జగన్ ఈ దిశగా అడుగులు వేయాల్సి ఉంది. మూడు రాజధానుల విషయంలో జగన్ అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాల్సి ఉంది. జగన్ తప్పటడుగులు వేస్తే ఆ ప్రభావం ఏపీ ప్రజలపై ఎన్నో సంవత్సరాల పాటు పడే అవకాశం ఉంది.

రాజధాని విషయంలో ఆలస్యం చేయడం వల్ల ఏపీ ప్రజలే నష్టపోతున్నారనే వాస్తవాన్ని జగన్ గమనించాల్సి ఉంది. మరో 18 నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జగన్ సర్కార్ సరైన నిర్ణయాలు తీసుకుంటే మాత్రమే పార్టీకి బెనిఫిట్ కలుగుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో జగన్ సర్కార్ సరైన నిర్ణయాలు తీసుకుని ప్రజలకు మంచి చేయాలని ఎక్కువమంది భావిస్తున్నారు.