ఏపిలో హోదాకై బంద్‌ పోరు(ఆందోళనల వీడియో)

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ప్రకటించాలనే డిమాండ్ తో నేడు ఆంధ్రప్రదేశ్ బంద్ కు వైసిపి పిలుపునిచ్చింది. వైసిపి నేతలు, ప్రజాసంఘాలు ఉదయం నుంచే బంద్ లో పాల్గొంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు డిపోలకే  పరిమితమయ్యాయి. వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు స్వచ్చంధంగా బంద్ లో పాల్గొన్నాయి. పలువురు వైసిపి నేతలను పోలీసులు గృహ నిర్భందం చేశారు. ఎక్కడికక్కడ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.

ఏపికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని వైసిపి డిమాండ్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైసిపి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తున్నది.  గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం పై ఉందని దానిని అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఏపి ప్రజలను మోసం చేస్తోందని వైసిపి నేతలంటున్నారు. వైసిపి ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది.