హీరో నితిన్‌కు ఇప్పుడు హిట్ చాలా అవసరం. కొన్ని రోజుల క్రితం విడుదలైన ‘చెక్’ భారీగా నిరాశపరచడంతో ఈసారి ‘రంగ్ దే’తో సాలిడ్ హిట్ అందుకోవాలని చూస్తున్నారు ఆయన. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రేపు 26వ తేదీన విడుదలకానుంది. ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండటంతో సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ భారీగా ప్లాన్ చేశారు. కానీ ఊహించని రీతిలో సినిమాకు కొత్త తలనొప్పి ఒకటి ఎదురవ్వబోతోంది. అదే భారత్ బంద్. దేశవ్యాప్తంగా రైతులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఆ ఉద్యమంలో భాగంగానే రేపు 26వ తేదీన భారత్ బంద్ తలపెట్టాలని నిర్ణయించారు. ఈ బంద్ ను విజయవంతం చేయాలని అన్ని రాష్ట్రాల్లోని లోకల్ పొలిటికల్ పార్టీలను కోరారు రైతు సంఘాలవారు. బీజేపీ, వాటి మిత్రపక్షాలు మినహా మిగతా పార్టీలన్నీ బంద్ కు మద్దతు తెలుపుతున్నాయి. వాటిలో తెలంగాణ పాలక పార్టీ కూడ ఉంది. దీంతో రేపు హైదరాబాద్ సిటీలో బంద్ గట్టిగానే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అదే గనుక జరిగితే నితిన్ సినిమా ఓపెనింగ్స్ దెబ్బతినే ప్రమాదముంది. అసలే హిట్ కోసం ఆతురతగా ఎదురుచూస్తున్న నితిన్ కు ఇది ఇబ్బందికరమైన వార్తే మరి.