AP: ఏపీలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు… దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం!

AP: ఏపీలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు ఒప్పందాలను కూడా రద్దు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే రేషన్ కార్డులను కూడా రద్దు చేయడానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటూ ఒక వార్త గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ఫోటోతో పాటు పార్టీ జెండా రంగులతో రేషన్ కార్డు ముద్రించి ఉంది.

ఈ క్రమంలోనే ఈ రేషన్ కార్డులను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం రాజముద్రతో కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయాలని భావిస్తున్నారు ఈ క్రమంలోనే ఈ నెల రెండో తేదీ నుంచి 28వ తేదీ వరకు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని వచ్చే ఏడాది సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులతో రేషన్ సరుకులను తీసుకోవడానికి వెసులుబాటు కల్పించిందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇక ఎన్నికలు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను పొందడం కోసం రేషన్ కార్డు ఎంతో ముఖ్యం కనుక గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డు లేని వారు అలాగే కొన్ని పొరపాట్లు ఉన్నవారు కూడా ఇప్పుడు కొత్త వాటికి అప్లై చేసుకునే అవకాశం కల్పించింది. అయితే ఈ విషయం తెలిసిన ఎంతోమంది పెద్ద ఎత్తున కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు కోసం ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే కొత్త రేషన్ కార్డు దరఖాస్తులపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు వెల్లడించింది.

కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన వెలువడ లేదని వెలగపూడి సచివాలయ అధికారులు ప్రకటించారు. డిసెంబర్ 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందనే విషయంపై కూడా ఇంకా అధికారిక సమాచారం వెలువడలేదన్నారు. కొత్త రేషన్ కార్డులను అప్లై చేసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా ఎటువంటి ఆప్షన్ ఇవ్వలేదని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.