AP: వైయస్ జగన్మోహన్ రెడ్డి హయామంలో ఏర్పాటైన గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగస్తులకు కూటమి సర్కార్ గట్టి షాక్ ఇచ్చింది. సచివాలయ ఉద్యోగస్తులకు ఇటీవల కొత్త నిబంధనలు వెలువడిన సంగతి తెలిసిందే వారు ఉదయం ఆఫీసుకు వచ్చిన సమయం అలాగే సాయంత్రం విధులు నుంచి వెళ్లే సమయంలో తప్పనిసరిగా బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. అప్పుడే జీతాలు సరైన విధంగా పడతాయి అంటూ కొత్త నిబంధనలను వెల్లడించిన విషయం తెలిసిందే.
అయితే ఈ విషయంపై కొంతమంది ఉద్యోగుల నుంచి అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఇలాంటి నిబంధనలు వచ్చిన తర్వాత కూడా కొన్ని చోట్ల ఉద్యోగస్తులు ఏమాత్రం బయోమెట్రిక్ రూల్స్ పాటించకపోవడంతో కూటమి సర్కార్ ఏకంగా 15000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా షోకాజ్ నోటీసులను జారీ చేసింది. కచ్చితంగా వీరందరూ కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.
ఇకపై బయోమెట్రిక్ ఉదయం సాయంత్రం వేయకపోతే ఆరోజును వారికి సెలవుగా పరిగణించబడి జీతాలను కూడా కట్ చేయబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా ఉద్యోగస్తులు మేలుకొని సరైన విధంగా బయోమెట్రిక్ రూల్స్ పాటించకపోతే తదుపరి మరిన్ని కఠినమైన చర్యలను కూడా తీసుకోవడానికి కూటమి సర్కార్ సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఇక కూటమి సర్కార్ తీసుకువచ్చిన ఈ అటెండెన్స్ యాప్ ద్వారా కొంతమంది ఉద్యోగస్తులకు చిక్కులు తప్పడం లేదు కొంతమంది ఫీల్డ్ వర్క్ కోసం బయటకు వెళ్లాల్సి ఉంటుంది. అలాంటిది తిరిగి సచివాలయం వద్దకు వచ్చి బయోమెట్రిక్ వేయాలి అంటే ఇబ్బందులు తలెత్తుతున్నాయి అంటూ కూడా చెప్పకు వస్తున్నారు.
అగ్రికల్చర్ అసిస్టెంట్లతో పాటు సర్వేయర్లు ఏఎన్ఎం వంటి వారు ఫీల్డ్ వర్క్ కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి సమయంలో సాయంత్రం కూడా అటెండెన్స్ వేయాలి అంటే ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాదన కూడా ఉంది. ఏది ఏమైనా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తుల విషయంలో కూటమి సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.