ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే, మూలిగే నక్క పై తాటికాయ పడితే ఎలా ఉంటుంది.. ఇప్పుడు టీడీపీ సిట్యువేషన్ కూడా అలాగే ఉంది. గత ఎన్నికల్లో టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించి చంద్రబాబు అండ్ బ్రదర్స్‌ను చావుదెబ్బ కొట్టింది వైసీపీ. ఇప్పటికీ వైసీపీ నేతల దూకుడుతో, ఫస్ట్రేషన్‌తో టీడీపీ నేతలు రోజురోజుకీ దిగజారిపోతున్నారు. మరోవైపు బీజేపీ కూడా ఇప్పుడు చంద్రబాబు తలపోటుగా మారింది.
గత ఎన్నికల నేపధ్యంలో బీజేపీతో దోస్తీ కటీఫ్ చేసుకున్న టీడీపీ భారీ మూల్యమే చెల్లించుకుంది. అయితే అప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీ నారాయణను అడ్డుపెట్టుకుని మరోసారి బీజేపీతో చెలిమి చేసేందుకు చంద్రబాబు అనేక రాకాలుగా ప్రయత్నించారు. ఆ తర్వాత అధ్యక్ష పదవిలోకి సోము వీర్రాజు ఎంట్రీ ఇవ్వడంతో టీడీపీకి చుక్కలు కనపడుతున్నాయి. ఊహించని విధంగా టీడీపీని టార్గెట్ చేసిన వీర్రాజు చంద్రబాబు అండ్ బ్రదర్స్‌ని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నాడు.
ఈ క్రమంలో ముందుగా టీడీపీ సీనియర్ నేత గద్దె బాబురావును బీజేపీలోకి తేవడంలో సక్సెస్ అయ్యారు వీర్రాజు. టీడీపీ పుట్టినప్పటి నుండి ఆ పార్టీలో ఉన్న గద్దె బాబారావు పార్టీ మారడంలో కీలకపాత్ర పోషించి చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. అయితే ఇప్పుడు మరో బలమైన సామాజికవర్గానికి చెందిన టీడీపీ నేతను బీజేపీలో చేర్చేందుకు ప్లాన్ వేశారని తెలుస్తోంది. అదే జరిగితే చంద్రబాబుకు మరో కోలుకోలేని దెబ్బే అని చెప్పాలి.
నైంటీస్‌లో చంద్రబాబు హయాంలో ఓ వెలుగు వెలిగిన పడాల అరుణకు టీడీపీలో ఓ ప్రత్యేక స్థానం ఉండేది. ఉత్తరాంద్రలో మంచి పట్టున్న అరుణది తూర్పు కాపుసామజికవర్గం. గజపతి నగరంలో ఆమెకు మంచి పట్టు ఉన్నా గత రెండు ఎన్నికల నుండి అరుణను చంద్రబాబు లైట్ తీసుకోవడంతో ఆగ్రహంగా ఉన్న ఆమె, ఇప్పుడు టైమ్ రావడంతో చంద్రబాబుకు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారనే టాక్ వినిపిస్తుంది. బీజేపీ నుండి పిలుపు రావడంతో, అరుణ కాషాయం కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతన్నారని వార్త పోలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పడాల అరుణ బీజేపీలో చేరితే చంద్రబాబుకు ఉత్తరాంధ్రలో పెద్ద దెబ్బే అని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.