మరో టీడీపీ కాతోపులాటలో ర్యకర్త మృతి… తెరపైకి జీవో నెంబర్ 1!

ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం జీవో నంబర్ 1 తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరు టీడీపీ సభల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రోడ్లపై సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ప్రభుత్వం ఈ జీవోను తెచ్చింది. తాజాగా టీడీపీ కార్యకర్త మరణించడంతో ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది.

అవును జనాలు కిక్కిరిసినట్లు చూపించాలనే ఉద్దేశ్యంతో ఇరుకు రోడ్లలో సభలు పెడుతూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని జగన్ సర్కార్ బలంగా నమ్మేది. పైగా టీడీపీ వరుస సభల్లో ఇలాంటి షంఘటనలు జరిగే సరికి జీవో నెంబర్ 1 ని తెరపైకి తెచ్చింది. దీంతో.. ప్రజల ప్రాణాలపై పెద్దగా పట్టింపులేకో ఏమో కానీ… కొంతమంది నాయకులు హైకోర్టుకు వెళ్లారు. అయితే కోర్టు వీరి వాదనతో ఏకీభవించింది. ప్రాథమిక హక్కులకు విఘాతంగా ఉందని కోర్టు అభిప్రాయపడింది. జీవో నంబర్ 1 ను సస్పెండ్ చేస్తూ ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

ఆ సంగతి అలా ఉంటే తాజాగా… భోజనాలు పెట్టే చోట కూడా తగు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఒక టీడీపీ కార్యకర్త మృతి చెందారు. ఈ ఘటన పిడుగు రాళ్ల మండలంలో జరిగింది.

వివరాళ్లోకి వెళ్తే… తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భవిష్యత్‌ కు గ్యారంటీ బస్సు యాత్రలో భగంగా… ఏర్పాటు చేసిన భోజనాల వద్ద అపశృతి చోటుచేసుకుంది. పిడుగు రాళ్ల మండలంలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బ్రాహ్మణపల్లిలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభ అనంతరం భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ భోజనాల సమయంలో ఒక్కసారిగా తోపులాట జరిగింది.

ఈ తోపులాటలో వేడి కుర్మా డేక్షలో యారగని కోటేశ్వరరావు అనే టీడీపీ కార్యకర్త పడిపోయాడు. దీంతో కోటేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కోటేశ్వరరావును వెంటనే పిడుగురాళ్ల ప్రైవేట్‌ హాస్పిటల్‌ కి తరలించారు. అప్పటికే అతని శరీరం సుమారు 70% మేర కాలిపోయిందని గుర్తించిన వైద్యులు.. మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోటేశ్వరరావు ప్రాణాలు కోల్పోయాడు.

దీంతో ఈ విషయంపై కోటేశ్వర రావు కుటుంబ సభ్యులతో పాటు ఆ సభలో పాల్గొన్న టీడీపీ కార్యకర్తలు సైతం టీడీపీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇరుకైన ప్రాంతంలో సభ ఏర్పాటు చేయడంతోపాటు భోజనాలు పెట్టే విషయంలో జాగ్రత్త తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని ఆరోపిస్తున్నారు.

దీంతో… ప్రజల ప్రాణాలకు రక్షణగా జగన్ సర్కార్ జీవో నెంబర్ 1 ని తీసుకొచ్చింది ఇందుకే అనే కామెంట్లు దర్శనమిస్తున్నాయి. జనాలు ఎక్కువగా వచ్చినట్లు చూపించే క్రమంలో ఇరుకు సందుల్లో సభలు ఏర్పాటు చేయడం వల్ల ఇలాంటి ప్రాణాలు పోతున్నాయని జగన్ సీరియస్ గా తీసుకున్నారని గుర్తుచేస్తున్నారు.