చంద్రబాబు మీడియా  కొత్త ఎత్తుగడ

పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న సమయంలో చంద్రబాబునాయుడుకు మద్దతుగా నిలబడే ఓ పచ్చపత్రిక కొత్త ఎత్తుగడ వేసింది. ఓటర్ల మైండ్ సెట్ మార్చటమే లక్ష్యంగా తెలుగుదేశంపార్టీకి 101 అసెంబ్లీ సీట్లంటూ ఓ సర్వేను అచ్చేసొదిలింది. మొన్ననే లోక్ నీతి సిఎస్ డిఎస్ సర్వేలో 125 సీట్లంటూ అచ్చేసి మొహం పగలగొట్టుకుంది. వారం క్రితం వచ్చిన ఆ సర్వే అంతా బోగస్ అని తేలిపోయింది.

ఎన్నికల తేదీ దగ్గరకు వచ్చేకొద్దీ జనాలు వైసిపి వైపు మళ్ళు తున్నారనే ప్రచారం ఎక్కువవుతోంది. దాంటో టిడిపి శిబిరంలో టెన్షన్ పెరిగిపోతోంది. అందుకని చంద్రబాబునాయుడును ఆదుకునే ఉద్దేశ్యంతో దాంతో జనాలను ఎలాగైనా టిడిపి వైపు మళ్ళించాలని తాజాగా కార్పొరేట్ చాణుక్య పేరుతో మరో సర్వేను వదిలింది. ఈ కార్పొరే సర్వే కూడా టిడిపి వినుకొండ ఎంఎల్ఏ జివి ఆంజనేయులు దగ్గర బంధువు అనీల్ కుమార్ దే అని సమాచారం.

అసలు కార్పొరేట్ చాణుక అనే సర్వే సంస్ధ ఉందో లేదో కూడా స్పష్టంగా తెలీదు. ఎన్నికల సమయం కదా అచ్చేసొదిలితే జనాలు ఏమైనా చదివేస్తారు, నిజాలని నమ్మేస్తారని బహుశా పచ్చపత్రిక గట్టిగా నమ్ముతున్నట్లుంది. అందుకే టిడిపికి 101 సీట్లు ఖాయమని తేల్చేసింది. వైసిపి 71 స్ధానాలకే పరిమితమవుతుందని కూడా జోస్యం చెప్పింది. చంద్రబాబే సిఎం కావాలని 48 శాతం జనాలు కోరుకుంటుంటే జగన్ వైపు 41 శాతం మొగ్గు చూపుతున్నారట.

సర్వేను ఫిబ్రవరి 14 నుండి ఏప్రిల్ 5వ తేదీ మధ్య జరిపినట్లు చెప్పింది. ఎవరిదో సంస్ధ పేరు వేస్తే మొహం పగలగొడతారన్న భయంతోనే టిడిపి బంధువు సంస్ధ పేరునే వాడుకుంటే సమస్యే ఉండదని అనుకుందేమో ? మొత్తానికి చంద్రబాబును మళ్ళీ సిఎం కుర్చీలో కూర్చోబెట్టటానికి నానా అవస్తలు పడుతోంది. పైగా ఏపిలో మళ్ళీ తెలుగుదేశమే అధికారంలోకి వస్తుందని మరో సర్వే స్పష్టం చేసిందంటూ భుజాలు చరుచుకోవటం గమనార్హం.

(ఆంధ్రజ్యోతి సౌజన్యంతో )