నకిలీ పాస్ పోర్టులతో అక్రమ రవాణా చేసిన కేసులో జగ్గారెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది. జగ్గారెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అయితే దీని పై జగ్గారెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. జగ్గారెడ్డిని మరింత లోతుగా విచారించాలని అతనికి బెయిల్ ఇవ్వవద్దని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగ్గారెడ్డి బయటికి వెళితే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని పోలీసులు చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించింది. జగ్గారెడ్డికి బెయిల్ మంజూరు పిటిషన్ ను కోర్టు కొట్టివేయడంతో జగ్గారెడ్డికి షాక్ తగిలింది.
2004లో నిర్మల, విజయ లక్ష్మీ, భరత్ ల పేర్లతో పాస్ పోర్టులు పొందారు. ఏజెంట్ మధు ద్వారా ముగ్గురిని తన భార్యపిల్లల పేర్లతో అమెరికాకు పంపేందుకు జగ్గారెడ్డి 15 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నారు. కూతురు విజయలక్ష్మీ పేరుతో శ్రీ తేజ జూనియర్ కాలేజి నుంచి బోనోఫైడ్ పోందారు. ఆమె పుట్టిన తేదిని 1987 సెప్టెంబర్ 3 గా మార్చారు. కొడుకు భరత్ సాయి రెడ్డి పేరు కోసం సంగారెడ్డిలోని కరుణ స్కూల్ నుంచి భోనోఫైడ్ పొందారు. అతని పుట్టిన రోజును 1989 మార్చి 5 గా పేర్కొన్నారు. అమెరికాకు గుజరాత్ కు చెందిన వారితో వెళ్ళిన జంగారెడ్డి తిరిగి వచ్చేటప్పుడు ఒక్కరే వచ్చారు.
ఈ వివరాలకు జగ్గారెడ్డి కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు వివరాలకు తేడాలున్నాయి. పాస్ పోర్ట్ కార్యాలయం సీనియర్ సూపరిండెంట్ , గతంలో జగ్గారెడ్డి దగ్గర పీఏగా పని చేసిన రాజేందర్ తో పాటు మరో ఇద్దరిని సాక్ష్యులుగా చేర్చారు. పక్కా ఆధారాలు ఉండటంతో జగ్గారెడ్డికి బెయిల్ ఇవ్వవద్దని పోలీసులు కోరారు. దీంతో జగ్గారెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు చేసి రిమాండ్ కు తరలించారు.