పోలవరం నిర్మాణంలో ఎలాంటి మార్పులు లేవు, చంద్రబాబు వచ్చి ఎత్తు కూడా కొలుచుకోవచ్చు : మంత్రి అనిల్‌కుమార్‌

anil kumar slams yellow media in today press meet

అమరావతి: తాడేపల్లిలోని వైస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి అనిల్ కుమార్‌ మాట్లాడుతూ… టీడీపీ పార్టీకి చెందిన యెల్లో మీడియాపై తన ఆగ్రహాన్ని చూయించారు.చేతులు తుడుచుకోవడానికి కూడా పనికి రాని ఒక పేపర్ పోలవరంపై తప్పుడు వార్తలు రాస్తోందని మంత్రి అనిల్ కుమార్‌ అన్నారు. పోలవరం ఎత్తు తగ్గించారని తప్పుడు కథనం ప్రచురించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిక్కుమాలిన పేపర్లు అడ్డం పెట్టుకుని చంద్రబాబు పిచ్చి రాతలు రాయిస్తున్నారని అన్నారు. పక్క రాష్ట్రంలో దాక్కుని కారు కూతలు కూయొద్దని హెచ్చరించారు.

anil kumar slams yellow media in today press meet
anil kumar slams yellow media in today press meet

పిచ్చి పట్టిన వారి మాదిరిగా ఇష్టం వచ్చినట్లుగా ఏది పడితే అది ప్రచురించేసి ప్రభుత్వంపై బురద జల్లటానికి చూస్తున్నారు.‘పోలవరం ఎత్తు తగ్గించారని చంద్రబాబుకు ఎవరు చెప్పారు? పోలవరం నిర్మాణంలో ఎలాంటి మార్పులు ఉండవు. పోలవరం ఎత్తు ఒక్క అంగుళం కూడా తగ్గించేది లేదు. పోలవరం నిర్మాణం షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. పోలవరం ప్రారంభం రోజున చంద్రబాబుకు కొత్త బట్టలు పంపిస్తాం.. చంద్రబాబు వచ్చి పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు కూడా కొలుచుకోవచ్చు. 2017లో పోలవరంపై కేంద్ర కేబినెట్‌ నోట్‌ను చంద్రబాబు చదివి వినిపించాలి? 2017లో మీరు కేబినెట్‌లో ఏ ఒప్పందం చేసుకున్నారో చెప్పగలరా? పోలవరం గురించి చంద్రబాబుకు మాట్లాడే అర్హత లేదు. పోలవరం నిర్వాసితుల గురించి చంద్రబాబు ఎప్పుడైనా ఆలోచించారా? కమీషన్ల కోసం ఆలోచించారే తప్ప నిర్వాసితులతో ఎప్పుడైనా మాట్లాడారా? పోలవరాన్ని వైఎస్ఆర్‌ ప్రారంభించారు.. వైఎస్ జగన్ పూర్తి చేస్తారు’అని మంత్రి అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు.