ఆంధ్ర ప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో 81,505 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 2,209 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 19,75,455 కి చేరింది. కరోనా కారణంగా కృష్ణ 6, గుంటూరు 4, చిత్తూరు 3, అనంతపురం 2, ప్రకాశం 2, తూర్పుగోదావరి 1, కడప 1, శ్రీకాకుళం 1, విశాఖపట్నం 1, పశ్చిమ గోదావరిలో ఒక్కరు చొప్పున మొత్తం 22 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 13,490 కి చేరింది.
కరోనాబారి నుంచి నిన్న 1,896 మంది కోలుకోగా వారితో కలిపి ఇప్పటి వరకు మొత్తం 19,41,372 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఏపీలో 20,593 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో 2,50,27,770 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే… అనంతపూర్-34, చిత్తూరు- 382, ఈస్ట్ గోదావరి-438, గుంటూరు- 183, కడప- 65, కృష్ణ- 243, కర్నూల్- 27, నెల్లూరు-307, ప్రకాశం- 184, శ్రీకాకుళం- 41, విశాఖపట్నం- 135, విజయనగరం- 30, వెస్ట్ గోదావరి-140 చొప్పున కేసులు నమోదయ్యాయి.
గమనిక: ప్రస్తుతం కరోనాను కట్టడికి వాక్సిన్ ఒక్కటే పరిష్కార మార్గం. కరోనా నిబంధనలను కూడా పాటించటం తప్పనిసరి.