ఏపీ కరోనా అప్డేట్: కొత్తగా 1,539 కేసులు, రెండు జిల్లాలలో కొనసాగుతున్న తీవ్రత

Andhra pradesh Corona health bulletin

ఆంధ్ర ప్రదేశ్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 67,590 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 1,539 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 20,04,835కి చేరింది. కరోనా కారణంగా చిత్తూరు 3, కృష్ణ 3, ప్రకాశం 2, తూర్పు గోదావరి 1, నెల్లూరు 1, కర్నూల్ 1, శ్రీకాకుళంలో ఒక్కరు చొప్పున ​మొత్తం 12 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 13,778 కి చేరింది.

Andhra pradesh Corona health bulletin
 

కరోనాబారి నుంచి నిన్న 1,140 మంది కోలుకోగా వారితో కలిపి ఇప్పటి వరకు మొత్తం 9,76,609 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఏపీలో 14,448 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో 2,63,37,946 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే… అనంతపూర్-26, చిత్తూరు-243, తూర్పు గోదావరి-228, గుంటూరు- 127, కడప- 80, కృష్ణ- 194, కర్నూల్- 15, నెల్లూరు-176, ప్రకాశం- 126, శ్రీకాకుళం- 15, విశాఖపట్నం- 92, విజయనగరం- 54, పశ్చిమ గోదావరి-163 చొప్పున కేసులు నమోదయ్యాయి.