రాజధాని విషషయంలో సీఆర్‌డీఏకు ఎదురుదెబ్బ తగిలింది. రాజధానిపై రైతుల అభ్యంతరాలను తీసుకునే విషయంలో గడువును పెంచుతూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యంతరాల గడుపు 17వ తేదీతో ముగిసింది. 20న జరిగే కేబినెట్, అసెంబ్లీ సమావేశాల్లో రాజధానిపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో హైకోర్టు ఉత్తర్వులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
రైతులు దాఖలు చేసిన పలు పిటీషన్లను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ప్రభుత్వ చర్యలను తప్పుబట్టింది. వాదనలు విన్న న్యాయస్థానం కేసు విచారణను ఈనెల 20వ తేదీకి వాయిదా వేసింది. అయితే రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది. అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాల్ని కోర్టులు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే పార్టీల రగడను కేవలం ప్రజాకోణంలో మాత్రమే చూడాల్సి ఉంటుందన్న వాదన వినిపిస్తోంది. ఇక అధికార- పాలనా వికేంద్రీకరణ విషయంలో వైకాపా పంతం కోర్టులో నెగ్గుతుందా లేదా? అన్నది చూడాల్సి ఉంది.