2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు చూసిన వైకాపా శ్రేణులకు.. ఇక ఎలాంటి సమస్యలూ ఉండవు, పార్టీ ప్రశాంతంగా నడిచిపోతుంది, బాబు ఇప్పట్లో తేరుకునే పరిస్థితి లేదు.. జగన్ కు ఇప్పట్లో తిరుగులేదు అనే భావన ఉండేది. ఒకరకంగా అది వాస్తవం అనేవారు కూడా ఎక్కువే. అయితే… ఇంతకాలం వైకాపాలో అసంతృప్తులు ఉన్నారని, జగన్ ఆలోచనావిధానమే అందుకు కారణం అని కథనాలు వస్తుండేవి. అయితే… గతకొంతకాలంగా జరిగిన అన్ని పరిణామాలనూ గమనిస్తే… సమస్య జగన్ కాదు – వైకాపాకు తలనొప్పి సజ్జల అని తెలుస్తుందని అంటున్నారు విశ్లేషకులు! ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం…
సాధారణంగా అధికార పార్టీల నుంచి జంపింగ్ లు ఉండవు. ప్రతిపక్షాల నుంచి అధికార పార్టీలోకి గోడలు దూకే “గొపి” లు ఉంటారు కానీ… అధికారం ఉన్నన్నాళ్లూ ఎవరూ మరో ఆలోచన చేయరు. అయితే.. విచిత్రంగా వైకాపాలో ఆ సమస్య మొదటినుంచీ ఉంది! ముందుగా వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయానికొస్తే… జగన్ తో పొసగక ఆర్.ఆర్.ఆర్ పార్టీని వదిలారని అంతా భావించారు. కానీ… వైకాపా ట్రిపుల్ ఆర్ మాత్రం… సగం సమస్య సకలశాఖా మంత్రి సజ్జలే అని ఎన్నో సార్లు స్పష్టం చేశారు. జగన్ ని తప్పుదోవ పట్టించడంలో సజ్జలకే ఫస్ట్ మార్క్స్ అని క్లారిటీ కూడా ఇచ్చారు. ఏ మంత్రిత్వ శాఖకు సంబందించిన ప్రెస్ మీట్ అయినా ఆయనే అడ్రస్ చేస్తున్నారని విమర్శించారు. సజ్జలకు అధికారికంగా ఏ అధికారం ఉందని ప్రశ్నిస్తూ విమర్శల వర్షాలు కురిపించారు. అంటే.. వైకాపాలో ఆర్.ఆర్.ఆర్. సమస్యకు సజ్జలే ప్రధాన కారణం అన్నమాట అని వైకాపా కార్యకర్తలు ఒక క్లారిటీకి వచ్చారు.
క పార్టీని వీడిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సైతం… తనపై నిఘా పెట్టారని, ఇదంతా సజ్జల సమక్షంలోనే జరిగిందని పరోక్షంగా ఫైరయ్యారు. ఇదే క్రమంలో తాజాగా పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి లు సైతం సజ్జలను టార్గెట్ చేస్తూనే విమర్శలు చేశారు. ఈ విషయంలో ఉండవల్లి శ్రీదేవి కాస్త ఇన్ డైరెక్ట్ గా విమర్శిస్తే…. ఆనం వారైతే నేరుగా దాడిచేశారు.
తాను క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డాననడం బురదజల్లే ప్రయత్నమేనన్.. వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా సజ్జలను టార్గెట్ చేసిన ఆయన… “నేను క్రాస్ ఓటు వేశానని చెప్పడానికి సజ్జల ఎవడు ” అని ప్రస్ణించారు. విలేఖరి స్థాయి నుండి సజ్జల నేడు వందల కోట్లు ఎలా సంపాదించారో తనకు తెలుసని ఆనం బాంబు పేల్చారు. “నేను క్రాస్ ఓటింగ్ చేసినట్టు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎవరు చెప్పారు? రాజ్యాంగేతర శక్తితో పరిపాలన చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది?” అని సజ్జలనుద్దేశించి ఆనం ఫుల్ ఫైర్ అయ్యారు. అంటే… సజ్జలే సమస్య అని ఆనం స్పష్టం చేశారన్నమాట.
ఇదే క్రమంలో తాడేపల్లి ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవి కూడా తాజాగా స్పందించారు. మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా తనపై ఇష్టారీతిన విమర్శలు చేస్తున్నారని శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఎమ్మెల్యేగా గెలిచిన మొదటి రోజు నుంచే తనపై పార్టీలో కుట్ర మొదలుపెట్టారని ఆరోపించిన ఆమె… తాను ఎవరికి ఓటేశానో “తనపై ఆరోపణలు చేస్తున్న వారికి” ఎలా తెలుసని.. తన కోసం స్పెషల్ గా పోలింగ్ బూత్ లో సీసీటీవీ కెమెరాలు ఏవైనా పెట్టారా? అని ప్రశ్నలవర్షం కురిపించారు. ఈ ప్రశ్నల్లో కూడా శ్రీదేవి విమర్శించింది సజ్జలనే అని అంటున్నారు!
దీంతో… జగన్ కి పరదాలు కట్టి, పార్టీ భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని.. తన స్వార్థ ప్రయోజనలాకోసం జగన్ పడిన కష్టాన్ని స్బూడిదపాలు చేస్తున్నాడని.. జగన్ ఇప్పటికైనా కళ్లు తెరవాలని.. ఆయన్ని ఎక్కడుంచాలో అక్కడుంచకపోతే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు వస్తాయని.. త్వరలో ఎన్నికలు ఉన్న తరుణంలో సచ్చు సహలహాలను సైడ్ చేయాలని సోషల్ మీడియా వేదికగా సజ్జలనుద్దేశీంచి స్పందిస్తున్నారు వైకాపా హార్డ్ కోర్ ఫ్యాన్స్!
మరి ఈ విషయాలన్నీ జగన్ చెవివరకూ వెళ్తాయా? లేక, అక్కడకూడా సజ్జల టోల్ గేట్ ఏమైనా ఉందా? అన్నది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి!