ఇంతకాలం బీజేపీతో పొత్తుకోసం పరోక్షంగా విపరీతంగా ప్రాకులాడుతున్నారనే కామెంట్లు ఎదుర్కొంటూ.. వాటికి నిత్యం బలం చేకూరుస్తూ.. ఏదో ఒక రోజు మంచిరోజు రాకపోతుందా అంటూ ఎదురుచూస్తున్న చంద్రబాబుకు గట్టి షాక్ తగిలింది. ఇప్పుడు బీజేపీ నేతలే వచ్చి పొత్తు పెట్టుకుంటామన్నా కూడా… వెంటనే “సరే” అనలేని పరిస్థితి తాజాగా తెరపైకి వచ్చింది.
అవును… తాజాగా తెలంగాణలోని చేవెళ్ల సభలో బీజేపీ కీలక నేత అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే… ముస్లింలకు రిజర్వేషన్లు తీసేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రిజర్వేషన్ వాటాను ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ లకు పంచుతామని చెప్పుకొచ్చారు. దీంతో… బీజేపీ వ్యూహాత్మక తప్పిదం చేసిందని… డూ ఆర్ డై సిట్యువేషన్ లో ఈ వ్యాఖ్యలు చేసిందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
కారణం… మనువాద సిద్ధాంతాన్ని నమ్ముకుని ముందుకెళ్తాదన్న విమర్శ బీజేపీపై ఉంది. ఫలితంగా బీజేపీకి ముస్లింలు ఎంతదూరమో… ఎస్సీ, ఎస్టీ, క్రీస్టియన్స్, విషయం గ్రహించిన బీసీలు కూడా అంతే దూరం!
ఆ సంగతి అలా ఉంటే… ఏపీలో బీజేపీతో పొత్తుకోసం చూస్తున్న చంద్రబాబు ఈ వ్యాఖ్యలపై ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తిగా మారింది. రాబోయే ఎన్నికల్లో జనసేన – టీడీపీలతో బీజేపీ కలవాలని కోరుకుంటున్న నేతలు అమిత్ షా తాజా వ్యాఖ్యలపై ఎలా రియాక్ట్ అవుతారనెది కీలకంగా మారింది. ఎందుకంటే… ఏపీ జనాల మధ్య ఇలాంటి వ్యాఖ్యలు నడవడం, చెల్లడం అంత ఈజీ కాదు!
గతంలో దళితులపై సృహకోల్పోయిన వ్యాఖ్యలు.. బీసీలపై మతిభ్రమించిన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు… 2019 ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు అనుభవించారన్నది తెలిసిందే! జనాభా ప్రాతిపదికన వారు ఎక్కువ కావడమే అందుకు కారణం కాదు… సామాజికంగా స్పందించే విషయంలో ఏపీ జనాల విచక్షణ వేరు! ఈ సమయంలో తెలంగాణలో ముస్లింలకు రిజర్వేషన్స్ ఎత్తేస్తామని అమిత్ షా చెప్పిన తర్వాత కూడా… ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి బాబు ముందుకు వస్తారా.. ఆసక్తి చూపిస్తారా..? చంద్రబాబు స్పందిస్తే బాగుంటుంది!
ఈ విషయంలో టీడీపీలో ఉన్న ప్రజాస్వామ్య వాదులు, లౌకిక వాదులు… ముస్లిం నేతలు, మైనార్టీ కార్యకర్తలు చంద్రబాబు ని స్పందించాల్సిందా కోరతారని ఆశిద్ధాం!