Ambanti: అంబంటి రాంబాబు తాజాగా ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా ఈయన కూటమి నేతల తీరు గురించి అలాగే పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సంపద సృష్టిస్తామంటూ కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టించకుండా మేమే దోచుకుంటాం అనే రీతిలో ఉన్నారని ప్రతి ఒక్కరి కన్ను అక్రమ సంపాదన పైనే ఉందని మండిపడ్డారు.
నూతన మద్యం పాలసీ విధానంలో కూడా ఎంతోమంది కూటమి నేతలు మద్యం దుకాణదారులను బెదిరించి వాటాలు తీసుకుంటున్నారు. ఇక ఉచిత ఇసుకలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని చివరికి బూడిద కోసం కూడా కొట్టుకుంటున్నారు అంటూ అంబంటి సెటైర్లు వేశారు. అవినీతి చేయడానికి కూటమి నేతలు పోటీ పడుతున్నారు. నియోజకవర్గాల్లో ఎల్‌ఎం (లోకల్ ఎమ్మెల్యే) ట్యాక్స్ నడుస్తోంది. ప్రతీదానికి లోకల్‌ఎమ్మెల్యే ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఎవరైనా వ్యాపారం చేయాలనుకున్న లేదా ఇతర చిన్న పనులు చేయించుకోవాలి అనుకున్న తప్పనిసరిగా ఈ టాక్స్ కట్టాల్సిందేనని ఈయన తెలిపారు.
ఇకపోతే పవన్ కళ్యాణ్ గురించి కూడా ఈయన మాట్లాడుతూ ఇటీవల కాకినాడ పోర్టుకు వెళ్లినటువంటి పవన్ కళ్యాణ్ అక్కడ రెండు నెలల నుంచి నేను ఇక్కడికి రావడానికి అధికారులు అడ్డుకుంటున్నారని మాట్లాడారు అసలు పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలోనే ఉన్నానని ఫీల్ అవుతున్నారు ఆయన అధికారంలో లేరా ఒకవేళ తనని అడ్డుకున్నది ఎవరు నారా లోకేష్ చంద్రబాబేనా అంటూ ప్రశ్నించారు.అసలు డిప్యూటీ సీఎంకు అంతలా ప్రాధాన్యం ఇవ్వొద్దనే అధికారులు అలా ప్రవర్తించారేమో అంటూ మాట్లాడారు.
పవన్‌కు తన డైలాగ్‌కు తగ్గట్లే.. లెక్కలేనంత తిక్క ఉంది. అందుకే.. కాకినాడ పోర్టు నుంచి ఆర్డీఎక్స్ రావొచ్చని, కసబ్ లాంటోళ్లు వస్తారని, హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాస్తానని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నారా లేకపోతే ప్రశ్నించే ధోరణిలోనే ఉన్నారా? ఆయన పెద్ద అసమర్థుడు అంటూ అంబంటి రాంబాబు పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.