పవన్ ని పక్కకెళ్లి ఆడుకోమంటున్న అంబటి రాయుడు!

జనసేన వారాహి యాత్ర – 2 లో భాగంగా ఏలూరు సభలో పవన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. వాలంటీర్లను సంఘవిద్రోహ శక్తులతో పోల్చిన విధానంపై పవన్ దిష్టిబొమ్మలు తగలబడుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా తాజాగా అంబటి రాయుడు స్మూత్ గా స్పందిస్తూ… పవన్ ని పక్కకు తీసి పాడేసినంత పనిచేశారు!

అవును… వారాహి యాత్ర – 1 లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో కులాల పంచాయతీలు పెట్టుకుంటూ, కులాల ప్రాతిపధికన కామెంట్లు చేస్తూ, ఆఖరికి సొంత సామాజికవర్గంలోని కీలక నేతలతో కూడా తలంటించుకున్నారు పవన్! ఈ నేపథ్యంలో తాజాగా వారాహి యాత్ర – 2 స్టార్ట్ అయ్యింది. ఈ యాత్రను వాలంటీర్లకు కేటాయించినట్లున్నారు!

దీంతో నోటికొచ్చిన విమర్శలు… ఆకాశ రామన్న ఉత్తరాళ్లాగా సమాచారం అందిందంటూ బురదజల్లేస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా జనాలు వాయించి వదిలిపెట్టేసారికి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఈ సమయంలో వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై అంబటి రాయుడు స్పందించారు. తనదైన శైలిలో వాలంటీర్లకు ధైర్యం చెప్పారు.

తాజాగా ఒక స‌మావేశంలో అంబ‌టి రాయుడు మాట్లాడుతూ… వాలంటరీ వ్యవస్థ గురించి ఎంత గొప్పగా చెప్పినా తక్కువేన‌ని అన్నారుల్. అలాంటి మంచి పనులు చేసేటప్పుడు ఎవరో ఒకరు బురద చల్లుతూనే ఉంటారని, వాటిని మనం పట్టించుకోకూడదని.. వలంటీర్లు అందరూ ధైర్యంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.

ఇదే సమయంలో… రాష్ట్రంలో వలంటరీ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందని చెప్పిన రాయుడు… దేశంలో 70 సంవత్సరాల నుంచి జరగనది మన రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ ద్వారా జరుగుతోందని స్పష్టం చేశారు.

అదేవిధంగా… రాష్ట్రంలోని ప్రతి మనిషికి ఏది అందాలో అది వాలంటరీ ద్వారా అందుతుందని చెప్పిన రాయుడు… క‌రోనా సమయంలో వాలంటీర్లు తమ ప్రాణాన్ని ఫణంగా పెట్టి అందరికీ సేవలందించార‌ని.. జీవితాంతం ప్రతి ఒక్కరూ దాన్ని గుర్తుపెట్టుకోవాలని.. ప్రజలకు మంచిగా సేవలందించే వాలంటరీ వ్యవస్థ మన రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడా లేదని గుర్తుచేశారు. దీంతో పవన్ పై అన్ని వర్గాల నుంచీ వ్యతిరేకత మొదలైపోయిందని అంటున్నారు పరిశీలకులు.