రాయుడు తెలివి… రాజకీయాలు వంటపట్టేస్తున్నాయి!

క్రికెట్‌ కు రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు రాబోయే రోజుల్లో పాలిటిక్స్‌ లోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారనే కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ తో రెండు సార్లు భేటీ అయిన రాయుడు.. గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేయొచ్చని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే… తాజాగా అంబటి రాయుడికి రాజకీయ తెలివితేటలు వచ్చేశాయని అంటున్నారు పరిశీలకులు.

అవును… క్రికెట్ నుంచి బయటకు వచ్చిన అంబటి రాయుడికి రాజకీయాలు వంటపట్టేశాయని అంటున్నారు పరిశీలకులు. కారణం… గతకొద్ది కాలంగా కృష్ణాడెల్టా ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ అంబటి రాయుడికి రాజధాని రైతులు తమ గోడు విన్నవించుకున్నారు. తమ సమస్యలు వినాలంటూ అంబటి రాయుడికి రైతుల అభ్యర్థించారు.

ఈ సమయంలో అక్కడనుంచి అంబటి నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు అన్న స్థాయిలో తప్పించుకున్నాడు రాయుడు. మరోసారి తప్పకుండా వింటాను అంటూ… అక్కడనుంచి వెల్లగా జారుకున్నారు. దీంతో అంబటి రాయుడికి కొద్ది కొద్దిగా రాజకీయ లక్షణాలు వచ్చేశాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో తాజాగా వెలగపూడిలోని వీరభద్రస్వామి దేవాలయానికి అంబటి రాయుడు వెళ్లారు. అయితే.. విషయం తెలుసుకొని అమరావతి రైతులు అక్కడికి చేరుకున్నారు. దీంతో సీన్ అంతా ఆసక్తికరంగా మారిపోయింది. అమరావతికి సంఘీభావం తెలుపాల్సిందిగా అక్కడకు చేరుకున్న రైతులు అంబటి రాయుడును కోరారు.

అవును… రాయుడిని కలుసుకున్న అమరావతి రైతులు తమ ఉద్యమానికి మద్దతు ప్రకటించాలని కోరారు. ఇదే సమయంలో జై అమరావతి అనాలని అడిగారు. దీంతో స్మూత్ గా స్పందించిన అంబటి రాయుడు… అమరావతి ఎక్కడికి వెళ్లదు అని సమాధానాన్ని ఇచ్చాడు. అమరావతి ఎక్కడికీ వెళ్లదనే విషయం జగన్ కూడా చెబుతున్నారు. కాకపోతే… పరిపాలనా రాజధానిగా మాత్రం ఉండదనేది స్పష్టత.

ఇదే సమయంలో రైతుల దీక్షా శిబిరానికి రావాల్సిందిగా రాజధాని రైతులు రాయుడిని కోరారు. దీంతొ ఈసారి వచ్చినప్పడు తప్పని సరిగా వస్తానని చెచెప్పిన రాయుడు మరోసారి జాగ్రత్తగా జారుకున్నాడు. ఈ సందర్భంగా… అంబటి రాయుడు ఆడిన ప్రతి మ్యాచ్‌ లో సెంచరి కొట్టాలని తామంతా కోరుకున్నామని రైతులు తెలపడం కొసమెరుపు!