పవన్.. ఏదో ఒకరోజు “బట్టలు కూడా పోగొట్టుకుంటావు”!

ఏపీలో రసవత్తర రాజకీయలకు తెరలేచింది. పవన్ వారాహి యాత్రలో భాగంగా జనసైనికులకు నడిరోడ్డుపై చూపిస్తున్న రాజకీయ సినిమాల ఫలితంగా… ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. దీంతో… వైసీపీ నేతలపై పవన్ చేస్తున్న కామెంట్లపై వైసీపీ నేతలు వరుసపెట్టి పవన్ ను వాయించేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ కాకినాడ సభపై తనదైన శైలిలో స్పందించారు మంత్రి అంబటి రాంబాబు.

తాజాగా సర్పవరం జంక్షన్ లో జరిగిన బహిరంగ సభలో మైకందుకున్న పవన్… ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ని నడిరోడ్డుపై కొట్టుకుంటూ వెళ్తానంటూ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే! అయితే ఈ విషయాలపై స్పందించిన మంత్రి అంబటి రాంబాబు… “ద్వారంపూడిని కొడతాడంటా… నీకు అంత దమ్ముందా.. ఇదేమన్నా సినిమా అనుకున్నావా.. ” అంటూ ప్రశ్నించారు. అనంతరం ఇలాగే మాట్లాడితే… చెప్పులు పోగొట్టుకున్నట్లు బట్టలు కూడా పోగొట్టుకుంటావు అని అంబటి కామెంట్ చేశారు.

ఈ క్రమంలో… దమ్ముంటే ఇవాళ్టి నుంచి పూర్తిస్థాయి రాజకీయాల్లో ఉంటానని పవన్ చెప్పగలవా అని ప్రశ్నించారు. ఇక కొత్తగా మొదలుపెట్టిన ప్రాణహాని టాపిక్ అంటూ ఎద్దేవా చేసిన అంబటి… పవన్ కల్యాణ్‌ కు నిజంగా ప్రాణహాని ఉంటే ముందుగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సలహా ఇచ్చారు. నోటికొచ్చినట్లు మాట్లాడటం వెనుక చంద్రబాబు స్క్రిప్ట్ ఉందని అంబటి ఆరోపించారు.

ఇదే సమయంలో తనను ఓడించడానికి 200 కోట్లు ఖర్చుపెట్టబోతున్నారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన అంబటి… అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్నట్లుగా వ్యగ్యంగా స్పందించారు. ఈ సందబ్ర్హంగా పవన్ ప్రచార వాహనం… వారాహి అంటే అమ్మవారని.. అలాంటి అమ్మవారి పేరున్న వాహనం ఎక్కి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అందువల్లే పవన్ కు సినిమాలే లేవని.. అన్ని ఫ్లాప్ అవుతున్నాయని అంబటి సెటైర్లు వేశారు.