ఆంబోతులకు ఆవుల్ని సఫ్లై చేసి… తెరపైకి ఎన్టీఆర్ రాముడు-భీముడు!

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార, విపక్షాల మధ్య వార్ ముదురుతోన్న సంగతి తెలిసిందే. పైగా ఏపీలో అధికారపార్టీ ఒంటరిగా ఉండటం… ప్రత్యక్షంగానో, పరోక్షంగానో విపక్షాలన్నీ కలిసే ఉంటున్నాయనే సంకేతాలు వస్తున్నాయి. ఇందులో భాగంగా ఏపీ సర్కార్ పై విమర్శలు చేసే విషయంలో విపక్షాలన్నీ ఒకే పాట పాడుతుండటంం గమనార్హం.

ఈ సమయంలో పవన్ కళ్యాణ్ తాజా చిత్రం “బ్రో”లో మంత్రి అంబటి రాంబాబును టార్గెట్ చేస్తూ పెట్టిన పాత్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీంతో ఆగ్రహంగా ఉన్న అంబటి.. ఢిల్లీకి వెళ్లి కేంద్ర దర్యాప్తు సంస్ధలకు ఈ సినిమా నిధులపై ఫిర్యాదు చేయబోతున్నారంటూ వార్తలు హల్ చల్ చేశాయి. అనుకున్నట్లుగానే గురువారం ఢిల్లీ చేరుకున్న అంబటి.. వైసీపీ ఎంపీలతో భేటీ అయ్యారు.

ఆ తర్వాత జల్ శక్తి మంత్రి షెకావత్ తోనూ పోలవరంపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలో చంద్రబాబు అంబటి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ టూర్లో చంద్రబాబు స్ధాయికి తగని మాటలు మాట్లాడుతున్నారని మంత్రి అంబటి ఆక్షేపించారు. తనను ఆంబోతు రాంబాబు అంటూ కించపరుస్తున్నారన్నారు.

ఇదే అమయంళొ ఇరిగేషన్ గురించి చెప్పమంటే.. “బ్రో” సినిమా గురించి చెబుతున్నారని అంబటి విమర్శించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలపై తానూ మాట్లాడగలనని మొదలుపెట్టిన అంబటి… చంద్రబాబు ఆంబోతులకు ఆవుల్ని సఫ్లై చేసి పైకి వచ్చాడని గతంలోనే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబుపై అంబటి మూడు కీలక ప్రశ్నలు సంధించారు. ఇందులో భాగంగా…

పోలవరం ప్రాజెక్టును 2018 కల్లా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తానని అసెంబ్లీలో చంద్రబాబు ఎందుకు చెప్పారు?

జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని కేంద్రమే నిర్మించి ఇస్తామంటే.. ఎందుకు తీసుకున్నారు?

పోలవరానికి వెన్నెమక లాంటి డయాఫ్రం వాల్ ను కాఫర్ డ్యాం పూర్తి కాకుండా ఎందుకు నిర్మించారు?

ఇలాంటి కీలకమైన, ప్రాథమిక ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తనపై విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు.

అనంతరం పవన్ బ్రో గురించి స్పందించిన అంబటి… బ్రో సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో పవన్ అయినా చెప్పాలని… పవన్ కు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో నిర్మాత అయినా చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా… ఎన్టీఆర్ “రాముడు-భీముడు” సినిమాలోలా పవన్ ను అంటే చంద్రబాబుకు గుచ్చుకుంటోందని ఎద్దేవా చేశారు ఏపీ మంత్రి రాంబాబు!