ఇళ్లు లేని పేదలు రాష్ట్రంలో ఉండకూడదని, అర్హులైన పేదలందరికీ ఇళ్లపట్టాలు ఇవ్వాలని, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని… పేదరిక నిర్మూళనే ధ్యేయమని ఏపీలో వైసీపీ సర్కార్ పనిచేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాజధాని ప్రాంతంలో సైతం పేదలకు నివాస స్థాలాను ఏర్పాటు చేయాలని జగన్ సర్కార్ భావించింది.
ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో ఆర్-5 జోన్ లో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. ఇళ్ల నిర్మాణం కోసం తాజాగా జగన్ శంకుస్థాపన కూడా చేశారు. దీంతో ఒకవర్గం మీడియా, విపక్షాల కళ్లల్లో మంటలు పుట్టాయి. బీపీ లెవెల్స్ పెరిగిపోయాయి! సరిగ్గా ఈ సమయంలో ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వ్యులు ఇచ్చింది.
అవును… ఏపీలోని అమరావతి ప్రాంతంలో ఆర్ – 5 జోన్ లో జగనన్న ఇళ్ల నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ జస్టిస్ సోమయాజులు, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరితో కూడిన త్రిసభ్య ధర్మాసనం స్టే విధించింది. అంటే… తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అక్కడ యథాతథ స్థితి నెలకొంటుందన్నమాట.
దీంతో ఒకవర్గం మీడియాకు ఎక్కడ లేని ఆనందం వచ్చేసినట్లుంది. ఏపీ సర్కార్ కి షాక్… అంటూ శీర్షికలు పెట్టి మురిసిపోతున్నట్లుగా తెగ రాసేసిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి! దీంతో ఇంతకంటే అజ్ఞానం మరొకటి ఉండదనే విషయం విపక్ష పెద్దలు కానీ.. వారి అనుంగ మీడియా సంస్థలు గానీ గ్రహించకపోవడమే 2019 ఫలితాలకు కారణం అని చెబుతున్నారు.
ఇక్కడ గమనించాల్సిందేమిటంటే… హైకోర్టు మధ్యంతర ఉత్తర్వ్యులు ఇచ్చింది. ఫలితంగా అమరావతి లో పేదలకోసం జగన్ సర్కార్ కట్టాలని ఉద్దేశించిన ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. దీంతో… “ఏపీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ”… జగన్ సర్కార్ కి భారీ షాక్” వంటి శీరిషికలు పెట్టడంలో అర్ధం… పేదలకు ఇళ్ల నిర్మాణాలు ఆగిపోతే జగన్ కే దెబ్బ అని ఆ వర్గం మీడియా అంగీకరిస్తోందనే అర్ధం ధ్వనిస్తోంది.
నిజానికి హైకోర్టు ఇచ్చిన మద్యంతర ఉత్తర్వ్యులు… రాజధాని ప్రాంతంలో ఇళ్లపట్టాలు తీసుకుని, ఇళ్ల నిర్మాణం ఎప్పుడవుతుందా అని వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్న పేదలకు షాక్.. పేద ప్రజలకు గట్టి ఎదురుదెబ్బ. కారణం… జనాలకు వాస్తవాలు తెలుసు. తమకు ఇంటి నిర్మాణ జరగకపోవడానికి చంద్రబాబు & కో కారణం అని వారు బలంగా నమ్ముతున్నారు! మరోపక్క జగన్ మాత్రం పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని వారి తరుపున పోరాడుతున్నారు.
ప్రస్తుతం ఇదే విషయాన్ని పరోక్షంగా తమ శీర్షికల ద్వారా చెప్పుకొచ్చింది ఒక వర్గం మీడియా. ఇంకో విషయం ఏమిటంటే… ఇళ్ల నిర్మాణం పూర్తయినా జగన్ సార్కార్ కే ప్లస్… అవ్వకపోతే టీడీపీకే మైనస్. జగన్ మళ్లీ వస్తే ఈసారి పూర్తిచేసేస్తాడులే అనే నమ్మకం ఉంటుంది. ఇలా ఆలోచించలేని ఒక వర్గం మీడియా… పేదప్రజలకు ఇళ్ల నిర్మాణాలు ఆపాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వ్యులను… “జగన్ కు గట్టి ఎదురుదెబ్బ” అని కథనాలు రాసుకుని ఆనందం పొందుతుంది!!