తాజాగా ఆంధ్ర ప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు గోదావరి వరదలు, పోలవరం ప్రాజెక్టు గురించి చర్చించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తుతో తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి నష్టం లేదు అని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఈ ప్రాజెక్టు ముంపు ప్రాంతాలను ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో కలిపిన తెలంగాణ నేతలు గుర్తించాలి అని అన్నారు.
ఇక ఒక మంత్రిగా సాంకేతిక అంశాలన్ని తెలియాల్సిన అవసరం లేదు అంటూ.. తనకు కూడా సాంకేతిక అంశాలు తెలియకున్నా కామన్ సెన్స్ ఉందని అన్నారు. ఇక దేశంలో ఆరోగ్య శాఖల మంత్రులు ఆసుపత్రుల్లో ఆపరేషన్లు చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఇక గోదావరికి భారీగా వరదలు వచ్చినా కూడా ఇటువంటి ప్రాణ నష్టం జరగలేదు అని.. అలా జరగకుండా తాము చూసుకున్నాము అని.. ముంపు బాధిత కుటుంబాలకు రూ.2 వేల చొప్పున సహాయం అందజేశాము అని అన్నారు.