ఆంధ్ర ప్రదేశ్ ఎఫ్ .డి .సి చైర్మన్ గా అలీ ..?
కమెడియన్ ఆలీ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై .ఎస్ . జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకున్నాడు . ఎన్నికల ముందు అలీ రాజకీయాల్లోకి రావాలనుకున్నాడు . అయితే మొదట అలీ తెలుగు దేశము పార్టీలో చేరుతున్నట్టు వార్తలు వచ్చాయి . విజయవాడలో అలికి సంబంధించిన ఒక కార్యక్రమంలో అప్పటి ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు పాల్గొని అలీని ఘనంగా సత్కరించాడు . అయితే ఆ తరువాత ఏమిజరిగిందో తెలియదు కానీ అలీ జగన్ మోహన్ రెడ్డిని కలసి ఎన్నికల ముందు వై .ఎస్ .ఆర్ . కాంగ్రెస్ పార్టీలో చేరాడు . అయితే ఆలీకి జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేకపోయాడు . అయినా అలీ వై .ఎస్ .ఆర్ . కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేశాడు .
పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అలీని జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీని చేస్తానని చెప్పాడు . అదికూడా అతనికి ఇవ్వలేకపోయాడని , అందుకే ఆలీని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవికి ఎంపిక చేసినట్టు తెలుస్తుంది . సినిమా రంగంలో నాలుగు దశాబ్దాల నుంచి వున్న ఆలీకి ఎఫ్ .డి .సి అయితేనే సముచితంగా ఉంటుందని జగన్ మోహన్ రెడ్డి భావించినట్టు తెలిసింది . ఇప్పటికే అనధికారికంగా తెలుగు సినిమా రంగంలోని ప్రముఖులకు తెలిసి పోయింది . ఆలీకి శుభాకాంక్షలు చెబుతున్నారు . బహుశా ఉత్తర్వులు రేపు వెలువడే అవకాశం వుంది .