రోడ్డు మీదే రచ్చ రచ్చ చేసిన ఎంఐఎం కార్యకర్తలు (వీడియో)

ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం కార్యకర్తలు అత్యుత్సాహం చూపించారు. హైదరాబాద్ లో నిత్యం రద్దీగా ఉండే ఎల్బీనగర్ ఎన్టీఆర్ మార్కెట్ హైవే పై వాహనాలను అడ్డుకొని బైక్ పై విన్యాసాలు చేశారు. అక్కడే పోలీసులు ఉన్నా కూడా పట్టించుకోకుండా చోద్యం చూశారు. అసలు వివరాలు ఏంటంటే..

ఎంఐఎం పార్టీ కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో ఇంటింటికి తిరుగుతారు లేదా ర్యాలీలు తీస్తారు కానీ వీరు విచిత్రంగా అనుకున్నారో ఏమో తెలియదు కానీ రోడ్డు మీద వాహనాలను ఆపేశారు. బైక్ రైడింగ్ విన్యాసాలు చేస్తూ నానా రచ్చ చేశారు. అక్కడే ఉన్న పోలీసులు కూడా వారిని అడ్డుకోలేకపోయారు.

ఎందుకంటే ఎంఐఎం పార్టీ టిఆర్ఎస్ కు మిత్ర పక్షం కావడంతో వారు కూడా కిమ్మనకుండా ఉండిపోయారు. భారీ ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసుల తీరు పై వాహనాదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం కార్యకర్తలు రచ్చ రచ్చ చేసిన వీడియో కింద ఉంది చూడండి.