ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్‌ను ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఏపీ సీఎస్‌గా ఉన్న నీలం సాహ్ని ఈ నెల 31న పదవీ విరమణ చేయనుండటంతో.. అదే రోజు ఆదిత్యనాథ్ దాస్ ఏపీ కొత్త సీఎస్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు.
ఇక ఏపీ సీఎస్‌గా పదవీ విరమణ చేయనున్న నీలం సాహ్నిని సీఎం ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. త్వరలోనే పదవీ విరమణ చేయనున్న నీలం సాహ్ని స్థానంలో సీఎం జగన్ ఎవరిని కొత్త సీఎస్‌గా ఎంపిక చేస్తారనే దానిపై అధికార వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
గతంలో జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ వైపు సీఎం జగన్ మొగ్గుచూపారు. ఆదిత్యనాథ్ దాస్ గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. జగన్ ఆస్తుల కేసులో అభియోగాలు కూడా ఎదుర్కొన్నారు.