ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు ఇంకా తొమ్మిది నెలల సమయం వున్నా , ఇప్పటినుంచే పొత్తుల కోసం ముమ్మర ప్రయత్నాలు మొదలయ్యాయి . తెలుగు దేశం పార్టీ , భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు కలసి 2014లో ఎన్నికల్లో తమ సత్తా చూపించాయి . 2019 ఎన్నికలకు ఈ మూడు పార్టీల దారులు వేరయ్యాయి. కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం , వైసీపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన బరిలో వుండే అవకాశం వుంది .
చంద్ర బాబు నరేంద్ర మోడీకి చెడిన తరువాత బాబు కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యాడు . ఇదే సందర్భంలో జగన్ మోడీకి చేరువయ్యాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి . చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో తెలంగాణలో పొత్తు పెట్టుకొనే అవకాశం వుంది . ఇప్పటికే దీనిపై బాబు పరోక్షంగా చెప్పాడు. శనివారం నాడు పార్టీ కార్య కర్తలు, నాయకులతో జరిగిన సమావేశంలో బాబు వారి సలహా ప్రకారం పొత్తులుంటాయని ప్రకటించాడు . అంటే తెలంగా నాయకులు కోరారు కాబట్టి కాంగ్రెసుతో పొత్తు పెట్టుకున్నానని చెబుతాడు . ఎంతైనా చంద్ర బాబు రాజకీయాల్లో ఆరితేరిపోయాడు . తన అభిప్రాయాన్ని కూడా ఇతరులదని నమ్మించగల సర్వ సమర్ధుడు బాబు.
ఇక జగన్ మోడీతో స్నేహం చేస్తున్నా వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదు . బీజేపీ తో కలసి ఎన్నికల్లో పోటీ చేస్తే మైనార్టీల ఓట్లు పోతాయని జగన్ భయం . ప్రజా సంకల్ప యాత్రతో జగన్ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాడననే మాట నిజం . గతంలో కంటే ఇప్పుడు వైసీపీ ఓటు బ్యాంకు పెరిగిందని అంటున్నారు . ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ మాట ఇచ్చి మోసం చేసిందని , రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి నమ్మక ద్రోహం చేసిందని చంద్ర బాబు తన ఆవేదన ప్రజలు వినిపిస్తున్నాడు . కేంద్రం సహకారం లేకపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని జనాన్ని నమ్మించడంలో సఫలం అవుతున్నాడు . ఓటు బ్యాంకు పెంచుకోవడానికి కేంద్రంపై బురద చల్లుతూనే వున్నాడు .
ఈ నేపథ్యంలో జగన్ తో పవన్ కళ్యాణ్ కలిస్తే ప్రభుత్వం ఏర్పాటు చెయ్యవచ్చనేది వైసీపీలో కొందరి నమ్మకం. అందులో ముఖ్యుడు సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరి రావు ఒకరు . ఆదిశేషగిరావు వైసీపీలో చురుకైన పాత్ర పోషిస్తున్నాడు . జగన్ కూడా ఆదిశేషగిరి రావుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు . ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారంలో తీసుకు రావాలని ఆదిశేషగిరావు ఆరాటపడుతున్నారు . పవన్ కళ్యాణ్ కలసి ఒప్పించే ప్రయత్నం చేశాడని , అయితే పవన్ కళ్యాణ్ జగన్ తో కలసి వెళ్ళడానికి సుముఖంగా లేడని తెలిసింది . అయినా ఆదిశేషగిరావు ప్రయత్నం చేస్తూనే వున్నాడట .
నిజానికి ఆదిశేషగిరి రావు తన కుమారుడు వివాహం చంద్ర బాబు చుట్టాలమ్మాయితో జరిపించాడు . చంద్ర బాబు నాయుడుకు ఆదిశేషగిరి రావు తో బంధుత్వం వున్నా బాబు అంటే ఆదిశేషగిరావుకు పడదు . వచ్చే ఎన్నికల్లో తెనాలి నుంచి శాసన సభకు ఆదిశేషగిరావు పోటీచేయబోతున్నాడు . వైసీపీ అధికారంలో వస్తే ఆదిశేషగిరావు మంత్రి అయ్యే అవకాశం వుంది . అందుకే ఆదిశేషగిరావు తనవంతు ప్రత్నం చేస్తున్నాడు .