ఈ విషయంలో అనుమానంగానే ఉంది. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంకెల గారడి వరకూ బాగానే ఉంది చూడటానికి. మొత్తం 2.27 లక్షల కోట్ల బడ్జెట్లో పన్ను వసూళ్ళ ద్వారా రూ 75,437 కోట్లు వస్తుందని అంచనా వేశారు. ఇంత వరకూ బాగానే ఉంది. మరి కేంద్రం నుండి వస్తుందని వేస్తున్న అంచనా రూ. 61,071 కోట్ల సంగతే అనుమానంగా ఉంది.
రాష్ట్రంలో వసూళ్ళవ్వాల్సిన పన్నులను పెంచుకోవటం కొంత వరకూ జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంది. చంద్రబాబునాయుడు హయాంలో పన్ను వసూళ్ళ అంచనా రూ 65,535 కోట్లయితే వచ్చింది రూ. 58,125 కోట్లు మాత్రమే. అంటే జగన్ నూరుశాతం పన్నులు వసూలు చేస్తారా ? లేకపోతే కొత్త పన్నులు వేస్తారా ? అన్నది చూడాలి. పై రెండింటిలో ఏది జరిగినా పన్ను వసూళ్ళ వరకూ జగన్ సక్సెస్ అయినట్లే.
అదే సమయంలో కేంద్రం నుండి వస్తుందని అంచనా వేస్తున్న గ్రాంట్ ఇన్ ఎయిడ్ విషయంలోనే తేడా కొట్టే అవకాశం ఉంది. కేంద్రం నుండి రూ. 50,695 కోట్లు వస్తుందని చంద్రబాబు అంచనా వేస్తే వచ్చింది మాత్రం రూ. 19,456 కోట్లు మాత్రమే. అంటే దాదాపు రూ. 30 వేల కోట్లకు బొక్కపడింది. నూరుశాతం పన్నులు వసూళ్ళు కాక, కేంద్రం నుండి వస్తుందనుకున్నది రాకపోవటంతో చంద్రబాబు దెబ్బతినేశారు.
కాబట్టి ఈ విషయంలో జగన్ జాగ్రత్తపడకపోతే కష్టమే. ఎందుకంటే, గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా కేంద్రం నుండి రూ. 61,071 కోట్లు అంచనా వేశారు. మోడితో ఎంత సఖ్యతగా ఉన్నా అంచనాల్లో సగం వచ్చినా గొప్పే. అలాకాకుండా నూరుశాతం పన్ను వసూళ్ళతో పాటు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కూడా జగన్ పూర్తిగా సాధించగలిగితేనే జగన్ గ్రేట్. లేకపోతే చంద్రబాబు బాటలో నడవాల్సిందే.