పరువు నష్టం దావా.! ఏబీఎన్ రాధాకృష్ణకి మాత్రమే ‘అది’ వుందా.?

విషయం ఒకటి, వివాదం మరొకటి.! జరగాల్సిన చర్చ ఒకటి, జరుగుతున్న రచ్చ ఇంకొకటి. ఓ ప్రజా ప్రతినిథి నగ్నంగా బుక్కయిపోయాడన్నది హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మీద వస్తోన్న ఆరోపణల సారాంశం. ఈ వ్యవహారానికి సంబంధించిన ఓ వీడియో సర్క్యులేట్ అవుతోంది. దాదాపు అన్ని మీడియా సంస్థలూ ఈ వ్యవహారాన్ని ‘కవర్’ చేశాయి. రచ్చ కొనసాగుతూనే వుంది.

ఎంపీ గోరంట్ల మాధవ్ మాట మీద అదుపు కోల్పోయారు. ఏబీఎన్ మీడియా సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణ మీద జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఏబీఎన్ రాధాకృష్ణ, న్యాయ పరమైన చర్యలకు ఉపక్రమిస్తున్నారట. ఈ క్రమంలోనే ఆయన హిందూపురం ఎంపీ మీద పరువు నష్టం దావా వేస్తారట కూడా. పది కోట్లకు పరువు నష్టం దావా వేయనున్నారట ఏబీఎన్ రాధాకృష్ణ.

సాధారణంగా పరువు నష్టం దావా కేసులు ఏళ్ళ తరబడి నడుస్తాయ్. ఐదేళ్ళకు తేలతాయో, పదేళ్ళకు తేలతాయో.. చెప్పలేం. ఈలోగా, ఆయా కేసుల్ని జనం మర్చిపోతారు కూడా. కేసు వేస్తే, అది తేలేటప్పటికి గోరంట్ల మాధవ్ అసలు రాజకీయాల్లోనే వుంటారో వుండరో తెలియని పరిస్థితి.

సరే, కేసు ఎప్పుడు తేలుతుందన్నది వేరే చర్చ. పరువు కేవలం ఏబీఎన్ రాధాకృష్ణకి మాత్రమే వుంటుందా.? గోరంట్ల మాధవ్‌కి వుండదా.? మీడియా చేతిలో వుంది గనుక అడ్డదిడ్డమైన కథనాలు వండి వడ్డిస్తాం, జుగప్సాకరమైన రీతిలో కథనాలు తయారు చేసి, ఎంపీ ఇమేజ్‌ని డ్యామేజ్ చేస్తామంటే ఎలా.?

అన్ని వ్యవస్థలూ భ్రష్టు పట్టిపోయాయ్ సమాజంలో. మీడియా కూడా ఆ సమాజంలో భాగమే కదా.? ఇతరుల వ్యక్తిగత జీవితాల్ని కించపర్చేలా మీడియా వ్యవహరించడం కొత్తేమీ కాదు. పైగా, బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలకు, పాత్రికేయ వ్యభిచారానికి తెలుగు మీడియాలో ప్రముఖ మీడియా సంస్థలు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాయన్న విమర్శలు ఈనాటివి కావు. ఆ లిస్టులో ఏబీఎన్ రాధాకృష్ణ పేరు కూడా తరచూ వినిపిస్తుంటుంది.