YS Jagan: వైయస్ జగన్ కి భారీ షాక్… పార్టీకి దూరం అవుతున్న మరో కీలక నేత?

YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఏపీ బాధ్యతలు తీసుకున్నారు. అయితే 2024 ఎన్నికలలో భాగంగా ఈయన కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమవుతూ ఓటమిపాలయ్యారు. ఇలా జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలు కావడంతో ఎంతో మంది కీలక నేతలు ఈ పార్టీ నుంచి బయటకు వస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇప్పటికే చాలామంది జనసేన తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోయారు తాజాగా మరో కీలక నేత కూడా జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చారని చెప్పాలి.వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత కొంత కాలంగా పార్టీకి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయం గురించి ఈయన ప్రకటించారు అయితే అవంతి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీలోకి చేరబోతున్నారంటూ వార్తలు వినపడుతున్నాయి.

వైసీపీ ఒడిపోయిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 2024లో భీమిలి నుంచి గంటా శ్రీనివాస రావుపై పోటీ చేసి ఓడిపోయారు. ఒకప్పుడు వీళ్లిద్దరూ మిత్రులుగా ఉండే వాళ్లు. తొలిసారి ఇద్దరూ పరస్పరం పోటీ పడ్డారు. ఇకపోతే ఈ రాజీనామా లేఖలో భాగంగా తన వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలకి కూడా రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. తన రాజీనామాను ఆమోదించాలని అధిష్ఠానానికి సూచించారు. ఇలా రాజీనామా లేఖను పంపించిన తర్వాత ఈయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారని ఆరోపించారు. కార్యకర్తలకు, నాయకులకు వైసీపీలో గౌరవం లేదని బాంబు పేల్చారు. కొత్త ప్రభుత్వానికి ఆరునెలల సమయం ఇవ్వాల్సింది పోయి అప్పుడే దాడి చేయడం సరికాదన్నారు. ఇలా పార్టీ నుంచి బయటకు రాగానే జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేయడం తగదంటూ పలువురు వైకాపా అభిమానులు అవంతి వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.