వైసీపీలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిల మధ్య భగ్గుమన్న రగడ

a big clash happend between pilli subhash chandrabose and dwarampudi chandrasekhar reddy

ఆంధ్ర ప్రదేశ్ : అధికార వైసీపీ పార్టీ నేతల మధ్య అంతర్గత యుద్ధం ఎక్కువగా జరుగుతోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు, వైసీపీలో ముందు నుంచి ఉన్న నేతల మధ్య కూడా వార్ జరుగుతోంది. రెండు వర్గాల నేతలు పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. ఎత్తులు పై ఎత్తులతో నియోజకవర్గాల్లో వాడివేడి వాతావరణాన్ని కల్పిస్తున్నారు. గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఇతర వైసీపీ నేతలు దుట్టా, యార్లగడ్డ మధ్య వార్ జరుగుతోంది. సాక్షాత్తూ జగన్ వారిద్దరికీ సర్ది చెప్పి, చేతిలో చెయ్యి కలిపి ఇద్దరూ సయోధ్యతో నడవాలని చెప్పిన తర్వాత కూడా వారు ఎవరిదారి వారిదే అన్నట్టుగా ఉన్నారు. ఇక ప్రకాశం జిల్లా చీరాలలో ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గాలు పరస్పరం దాడులు కూడా చేసుకున్నారు .

a big clash happend between pilli subhash chandrabose and dwarampudi chandrasekhar reddy
a big clash happened between pilli subhash chandra bose and dwarampudi chandrasekhar reddy

ఇప్పుడు కొత్తగా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.తూర్పుగోదావరి జిల్లా డీఆర్సీ సమావేశంలో ఈ ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం జరిగింది. టిడ్కో ఇళ్ల వ్యవహారం ఎంపీ, ఎమ్మెల్యే మధ్య మాటలయుద్ధానికి కారణమైంది. టిడ్కో ఇళ్ల కేటాయింపులో అవినీతి జరిగిందంటూ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. అయితే, వెంటనే ద్వారంపూడి జోక్యం చేసుకున్నారు. పిల్లి ఆరోపణలను ఖండించారు. అవినీతికి పాల్పడిన వారి వివరాలు తనకు ఇవ్వాలని కోరారు.ఈ క్రమంలో మరోసారి పిల్లి సుభాష్ చంద్రబోస్ మెడలైన్ వంతెన గురించి కూడా ప్రస్తావించారు. ఈ వంతెన నిర్మాణం విషయంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ అభ్యంతరం తెలిపారు. కాకినాడ సిటీతో పాటు గ్రామీణ ప్రాంతాలు కూడా మునిగిపోయే మెడలైన్ వంతెన నిర్మాణాన్ని ఆపేయాలని రాజ్యసభ ఎంపీ సూచించారు. అయితే, దీనిపై కూడా ద్వారంపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం జరిగింది. పరస్పరం మాటల తూటాలు పేలాయి. ఇద్దరు నేతలు వెనక్కి తగ్గకుండా వాదులాడుకున్నారు. ఈ క్రమలో జిల్లా కలెక్టర్ అర్థంతరంగా డీఆర్సీ సమావేశాన్ని వాయిదా వేశారు.