న్యాయ వాది సిద్దార్థ లూద్రా కోసం 50 కోట్లు ఖర్చు చేశారా.?

నల్ల కోటు.! మరీ అంత ఖరీదైనదా.? ఈ డౌటానుమానం చాలామందిలో కలుగుతోంది. కాదని ఎలా అనగలం.? ప్రత్యేక విమానంలో సీనియర్ లాయర్లను తీసుకొస్తుంటారు.. ఢిల్లీ నుంచీ, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచీ.!

ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గతంలో అక్రమాస్తుల కేసులో అరెస్టయినప్పుడూ.. అంతకు ముందూ, అత్యంత ఖరీదైన న్యాయవాదుల వ్యవహారం ప్రచారంలోకి వచ్చింది. అయితే, అప్పుడు లక్షల్లో.. ఇప్పుడు కోట్లల్లో.. అంటూ సాధారణ ప్రజానీకంలో చర్చ జరుగుతోంది.

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ నేపథ్యంలో ప్రత్యేక విమానంలో న్యాయవాది సిద్దార్ధ లూద్రా, అతని టీమ్ విజయవాడకు చేరుకుంది. ఆయనకు టీడీపీ అనుకూల మీడియా ఇచ్చిన కవరేజ్ చూస్తే, కేజీఎఫ్ సినిమా తాలూకు బిల్డప్ సీన్స్ గుర్తుకొస్తాయ్.!

లూద్రా ‘విజయ సంకేతం’ ఇచ్చారు.. బెయిల్ వచ్చేసింది.. అంటూ ప్రచారం చేసుకున్నారు సోషల్ మీడియాలో టీడీపీ మద్దతుదారులు. కానీ, ఏం జరిగింది.? ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ముందర లూద్రా వాదనలు వీగిపోయాయి.

సింపుల్‌గా బెయిల్ వచ్చేసే కేసు.. అని చాలామంది భావించారు. కానీ, సీన్ మారిపోయింది. బెయిల్ కోసం నానా తంటాలూ పడాల్సి వచ్చింది ‘వ్యవస్థల్ని మేనేజ్ చేయగలిగే’ చంద్రబాబుకి.! ఇక్కడితో మేటర్ క్లియర్. కొన్ని కొన్ని వ్యవహారాల్ని డబ్బులతోనో, మేనేజ్ చేయడంతో చక్కబెట్టలేరని.!

గతంలో ఓ కేసు నిమితం ఐదు హియరింగ్స్ కోసం సుమారు పాతిక లక్షలు తీసుకున్నారట జస్టిస్ లూద్రా. ఇంకో కేసులో, మూడు హియరింగ్స్‌కిగానూ ఒక్కో హియరింగుకీ దాదాపు పది లక్షలు తీసుకున్నారట ఆయన. ఈ వ్యవహారాలన్నీ ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి.

ఒకప్పుడు, రామ్ జెఠ్మలానీ గురించి ఇలా చెప్పుకునేవారు.! దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్ ఆయన. లూద్రా యాభై కోట్లు నిజం కాకపోవచ్చుగానీ.. ప్రస్తుతానికి ఆయనే అత్యంత ఖరీదైన న్యాయవాది. ప్చ్.. బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది ఆయనకిచ్చిన పేమెంట్.!