టీడీపీ అధినేత చంద్రబాబు పై వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ ఎన్నికల నేపధ్యంలో ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన బొత్స.. ఒకవైపు సంఖ్యాభలం లేకపోయినా.. మరోవైపు ఓటమి తప్పదని తెలిసినా కూడా వర్ల రామయ్యను బరిలోకి కావాలనే దించారని.. దీంతో చంద్రబాబు దళితులను అవమానించటమే అని.. బలం లేదని తెలిసినా కూడా టీడీపీ అభ్యర్ధిని బరిలోకి దింపటం నీచమని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
తాజా రాజ్యసభ ఎన్నికల బరిలో టీడీపీ నిలవటం ద్వారా.. ప్రజల్లో పలుచన కావటం తప్ప సాధించింది ఏమీ లేదని.. చంద్రబాబు వంకర బుద్ధి కారణంగా టీడీపీ చివరికి మరోసారి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుందని బొత్స విమర్శించారు. టీడీపీ గెలిచే అవకాశం ఉన్న ప్రతిసారి కూడా బడాబాబులకే టిక్కెట్లు ఇచ్చిందని.. అయితే ఇప్పుడు చ్చితంగా ఓడిపోయే సీటును మాత్రం వర్ల రామయ్యకు కేటాయించటం అనేది టీడీపీ ఎలా సమర్ధించుకున్నా కూడా దాంట్లో ఏ మాత్రం హేతుబద్దత బొత్స కన్పిందన్నారు.
ఇక చంద్రబాబు అంత మోసగాడు ఎవరూ లేరని, ఆయన జీవితం అంతా కుట్ర రాజకీయాలే అని బొత్స మండి పడ్డారు. అలాగే గవర్నర్ ప్రసంగం వినడం ఇష్టం లేని చంద్రబాబు, గవర్నర్‌ను ఎలా కలుస్తారు అని బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు రాజకీయ పుస్తక పేజీ చిని గిపోయిందని, ఇక అందులో కొత్త పేజీలు లేవని.. చంద్రబాబు చాణక్యం ఇకముందు పని చేయదని, 40 ఇయర్స్ ఇండస్ట్రీ కథ త్వరలో పూర్తిగా కనుమరుగు అయిపోతుందని బొత్స వ్యాఖ్యానించారు. మరి బొత్స వ్యాఖ్యలు టీడీపీ బ్రదర్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.