ఏపీలో 2024 ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ గెలవడానికి సమానంగా అవకాశాలు ఉన్నాయి. వైసీపీ వల్ల నష్టపోయిన వాళ్లు, వేర్వేరు కారణాల వల్ల వైసీపీ పథకాల ప్రయోజనాలను పొందని వాళ్లు, వైసీపీ అభివృద్ధి చేయలేదని బలంగా నమ్మే వాళ్లు వైసీపీకి ఓటేయకూడదని భావిస్తున్నారు. అయితే చంద్రబాబు మళ్లీ సీఎం అయితే ఏపీ ప్రజలు నష్టపోతారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చినా ప్రజలకు నష్టమే అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో జరిగిన అవినీతి అంతాఇంతా కాదు. చంద్రబాబు అధికారంలో ఉంటే అన్ని వర్గాల ప్రజలకు పథకాల ప్రయోజనాలు దక్కుతాయని చెప్పలేము. చంద్రబాబుకు అనుభవం ఉన్నా ప్రజలకు ఏం కావాలో మాత్రం తెలియదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
చంద్రబాబు నాయుడుకు మళ్లీ ఓటేసి ప్రజలు నష్టపోతారో లేక మరో పార్టీని ఎంచుకుంటారో చూడాల్సి ఉంది. జనసేన లేదా వైసీపీ ప్రజలకు బెటర్ ఆప్షన్స్ కాగా జనసేన దూకుడు పెరిగితే మాత్రమే ఆ పార్టీకి మేలు జరుగుతుంది. సొంతంగా రాజకీయాలు చేస్తే మాత్రమే ఆ పార్టీ భవిష్యత్తు బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
చంద్రబాబు నాయుడుకు 2024 కీలకమైన ఎన్నికలు కాగా ఈ ఎన్నికల్లో గెలవడానికి ఉన్న ఏ అవకాశాన్ని ఆయన వదులుకోవడం లేదు. లోకేశ్ పాదయాత్ర వెనుక కూడా అసలు రీజన్ ఇదేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. లోకేశ్ పాదయాత్ర సక్సెస్ ఫుల్ పాదయాత్ర అవుతుందో లేక ఫెయిల్యూర్ పాదయాత్ర అవుతుందో చూడాల్సి ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.