ఏపీలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు 2024 ఎన్నికలు కీలకం అనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది అమలు చేసే పథకాల ఆధారంగా, తీసుకునే నిర్ణయాల ఆధారంగా వైసీపీ భవిష్యత్తు ఏపీలో ఏ విధంగా ఉండబోతుందో డిసైడ్ కానుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సైతం 2024 ఎన్నికల్లో గెలవడానికి ఏం చేయాలన్నా ఈ ఏడాది తీసుకునే నిర్ణయాలే కీలకమని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఏపీ సీఎం జగన్ ఈ ఏడాది కూడా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని భావిస్తున్నారు. హామీల అమలు ద్వారా పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు మరింత దగ్గర కావాలని జగన్ అనుకుంటున్నారు. టీచర్లను ఎన్నికల విధులకు దూరం పెట్టిన జగన్ ఎన్నికల్లో గెలుపునకు సంబంధించి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవాలని భావించడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.
పవన్ కళ్యాణ్ మాత్రం ఎన్నికల ముందు మాత్రమే ప్రచారం చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ ప్రచారానికి దూరంగా ఉండబోతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయ్యారని సమాచారం. జనసేన ఏకంగా 40 స్థానాలలో పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. అయితే స్థానాలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.
పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో ఏ పార్టీ గెలవాలో డిసైడ్ చేయనున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. టీడీపీపై ఏపీ ప్రజల్లో వ్యతిరేకత ఏ మాత్రం తగ్గలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టీడీపీని జనసేన నమ్ముకోవడం వల్ల ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. లోకేశ్ పాదయాత్రను నమ్ముకుని చంద్రబాబు ఎన్నికల విషయంలో ముందడుగులు వేయనున్నారు.